- Telugu News Photo Gallery Cinema photos Pawan kalyan hari hara veeramallu vijay devarakonda kingdom movie release details
పవర్ స్టార్ కోసం ఆ హీరో తగ్గుతారా ?? లేదా పోటీ పడతారా ??
భారీ సినిమాల రిలీజు డేట్లు అటూ ఇటూ మారిన ప్రతిసారీ, మిగిలిన సినిమాల్లో మూమెంట్ తప్పడం లేదు. ముందుకు జరగడమో, వెనక్కి వెళ్లడమో.. ఏదో రకంగా అడ్జస్ట్ అయితే అవ్వాల్సిందే. మరి పవర్‌స్టార్ కోసం రౌడీహీరో అడ్జస్ట్ కావాల్సిన సిట్చువేషన్ ఉందా? సమ్మర్‌కి పవర్‌స్టార్ రావడం గ్యారంటీ అనే మాటను నిలబెట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు మేకర్స్.
Updated on: May 09, 2025 | 1:15 PM

భారీ సినిమాల రిలీజు డేట్లు అటూ ఇటూ మారిన ప్రతిసారీ, మిగిలిన సినిమాల్లో మూమెంట్ తప్పడం లేదు. ముందుకు జరగడమో, వెనక్కి వెళ్లడమో.. ఏదో రకంగా అడ్జస్ట్ అయితే అవ్వాల్సిందే. మరి పవర్‌స్టార్ కోసం రౌడీహీరో అడ్జస్ట్ కావాల్సిన సిట్చువేషన్ ఉందా?

సమ్మర్‌కి పవర్‌స్టార్ రావడం గ్యారంటీ అనే మాటను నిలబెట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు మేకర్స్. మరో రెండు రోజుల్లో పర్ఫెక్ట్ రిలీజ్ డేట్‌ని ఫిక్స్ చేస్తారు. దానికి తగ్గ ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.

హరిహరవీరమల్లుని మే 30న విడుదల చేస్తారా? మరో వారం అటుగా జరిపి జూన్‌కి తీసుకొస్తారా? అంటూ ట్రేడ్ పండిట్స్ లో డిస్కషన్ షురూ అయింది.

జూన్‌కి వెళ్తే ఓకే.. కానీ, ఓటీటీ డీల్ ప్రకారం మేలోనే చేయాలని ఫిక్సయితే కింగ్‌డమ్ తేదీని కబ్జా చేసే సినారియో కనిపిస్తోంది. విజయ్ దేవరకొండ నటించిన సినిమా కింగ్‌డమ్. ఆల్రెడీ మంచి హైప్ క్రియేట్ అయింది మూవీ మీద.

రీసెంట్‌గా రిలీజ్ అయిన సాంగ్‌కి కూడా సూపర్ క్రేజ్ వచ్చింది. మరి దాన్ని క్యాష్ చేసుకోవడానికి చెప్పిన టైమ్‌కే వచ్చేస్తారా? లేకుంటే పవర్‌స్టార్ కోసం పక్కకు జరుగుతారా? ఇన్ని ప్రశ్నలకూ ఆన్సర్ తెలియాలంటే జస్ట్ టూ మోర్ డేస్ వెయిటింగ్ తప్పదు మరి.




