Tollywood: బాబోయ్.. ఆ టాలీవుడ్ హీరో భార్య ఇంత స్టైలిష్‌గా మారిపోయిందేంటి? ఎవరో గుర్తు పట్టారా?
భీమవరంలో జన్మించిన ఈ అందాల తార ముంబై, హైదరాబాదుల్లో స్కూల్ విద్యను పూర్తిచేసింది. 11 ఏళ్ల వయసులోనే బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత హీరోయిన్ గానూ కొన్ని సినిమాలు చేసింది. అదే క్రమంలో ఓ తెలుగు హీరోను ప్రేమ వివాహం చేసుకుంది.

పై ఫొటోలో అల్ట్రా స్టైలిష్ లుక్ లో మెరిసిపోతున్నదెవరో గుర్తు పట్టారా? ఆమె ఓ టాలీవుడ్ హీరో సతీమణి. పెళ్లికి ముందు పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. సహాయక నటిగానూ మెరిసింది. అయితే పెళ్లి తర్వాత కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చింది. సినిమాలకు క్రమంగా దూరమైపోయింది. అయితే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటోంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ గ్లామర్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోస్, వీడియోలను అందులో షేర్ చేస్తుంటుంది. అలా తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోలు తెగ వైరలవుతున్నాయి. ఇందులో ఆమె అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించింది. అది కూడా రాత్రి పూట రోడ్డు మీద పోజులిచ్చింది. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు షాక్ అవుతున్నారు. హీరో సతీమణి ఇంత స్టైలిష్ లుక్‌లోకి మారిపోయిందేంటి? అని క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఈ అందాల తార ఎవరో గుర్తు పట్టారా? తను మరెవరో కాదు వరుణ్ సందేశ్ సతీమణి వితికా షేరు.
వితిక 11 సంవత్సరాల వయస్సులో బాలనటిగా తన నటన జీవితాన్ని ప్రారంభించింది. 2008లో అంతు ఇంతు ప్రీతి బంతు (తెలుగులో ఆడవారి మాటలకు అర్థాలే వేరులేలో కలర్స్ స్వాతి పాత్ర) కన్నడచిత్రంతో సినీరంగ ప్రవేశంచేసింది.ఆ తరువాత కన్నడలోనే 2009లో ఉల్లాస ఉత్సాహ సినిమాలో నటించింది. 2009లో ప్రేమించు రోజుల్లో అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది. ఆ తర్వాత సందడి, ఝుమ్మంది నాదం, భీమిలి కబడ్డీ జట్టు, ప్రేమ ఇష్క్ కాదల్, పడ్డానండి ప్రేమలో మరి, మహాబలిపురం సినిమాల్లో హీరోయిన్ గా, సహాయక నటిగా అలరించింది.
వితికా షేరు లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
పడ్డానండి ప్రేమలో సినిమా షూటింగ్ సమయంలోనే వరుణ్ సందేశ్ తో ప్రేమలో పడింది వితిక. ఆ తర్వాత పెద్దల అశీర్వాదంతో 2016లో పెళ్లిపీటలెక్కారు. 2019లో టీవీ రియాలిటీ కార్యక్రమమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 పోటీలో ఇద్దరూ సందడి చేశారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది వితికా షేరు.
భర్త వరుణ్ సందేశ్ తో వితికా షేరు..
View this post on Instagram
సంక్రాంతి సంబరాల్లో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.