Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Madha Gaja Raja Movie Review: మదగజ రాజా సినిమా రివ్యూ.. 12 ఏళ్ల తర్వాత రిలీజైన విశాల్ మూవీ ఎలా ఉందంటే..

2013లో విడుదల కావాల్సిన సినిమా ఇన్నేళ్ళ తర్వాత రిలీజ్ అవ్వడం.. బ్లాక్‌బస్టర్ కావడం అనేది అరుదుగా జరుగుతుంది. అది విశాల్ మదగజరాజా విషయంలో జరిగింది. అప్పుడెప్పుడో 2013లో రావాల్సిన సినిమా ఈ మధ్యే పొంగల్‌కు తమిళనాట విడుదలై సంచలనం రేపింది. తాజాగా తెలుగులోనూ విడుదలైంది మదగజరాజా. మరి ఆ సినిమా ఎలా ఉందో చూద్దాం..

Madha Gaja Raja Movie Review: మదగజ రాజా సినిమా రివ్యూ.. 12 ఏళ్ల తర్వాత రిలీజైన విశాల్ మూవీ ఎలా ఉందంటే..
Madha Gaja Raja Movie Review
Follow us
Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Rajitha Chanti

Updated on: Jan 31, 2025 | 2:27 PM

మూవీ రివ్యూ: మదగజరాజా

నటీనటులు: విశాల్, అంజలి, వరలక్ష్మీ శరత్ కుమార్, , సోనూ సూద్, సంతానం, దివంగత మనోబాల, గాయత్రీ రావు, దివంగత మణివణ్ణన్, శరత్ సక్సేనా, సత్య కృష్ణన్ తదితరులు

ఎడిటర్స్: ప్రవీణ్ కేఎల్, ఎన్బీ శ్రీకాంత్

సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ఎమ్ నాథన్

సంగీతం: విజయ్ ఆంటోనీ

నిర్మాతలు: జెమినీ ఫిల్మ్ సర్క్యూట్

కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: సుందర్ సి

2013లో విడుదల కావాల్సిన సినిమా ఇన్నేళ్ళ తర్వాత రిలీజ్ అవ్వడం.. బ్లాక్‌బస్టర్ కావడం అనేది అరుదుగా జరుగుతుంది. అది విశాల్ మదగజరాజా విషయంలో జరిగింది. అప్పుడెప్పుడో 2013లో రావాల్సిన సినిమా ఈ మధ్యే పొంగల్‌కు తమిళనాట విడుదలై సంచలనం రేపింది. తాజాగా తెలుగులోనూ విడుదలైంది మదగజరాజా. మరి ఆ సినిమా ఎలా ఉందో చూద్దాం..

కథ:

మదగజరాజ అలియాస్ రాజు (విశాల్) ఒక ఊరిలో కేబుల్ ఆపరేటర్‌గా పని చేస్తుంటాడు. అతడి తండ్రి పోలీస్ అధికారి. రాజు తన కుటుంబంతో పాటు హాయిగా లైఫ్ లీడ్ చేస్తుంటాడు. తొలి చూపులోనే మాధవి (అంజలి)ని చూసి ప్రేమిస్తాడు. అయితే మాధవి తండ్రి, రాజు తండ్రి మధ్య గొడవ కావడంతో ఇద్దరూ విడిపోతారు. ఆ తర్వాత రాజు, అతని ఫ్రెండ్స్ కలిసి చిన్నప్పటి మాస్టర్ (శరత్ సక్సేనా) కూతురు పెళ్లికి వస్తారు. అదే పెళ్లికి మాయ (వరలక్ష్మి శరత్ కుమార్) కూడా వస్తుంది. అక్కడ తన స్నేహితుల సమస్యలు తెలుసుకుంటాడు రాజు. ఒకరేమో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు.. మరొకరు జైలుకు వెళ్లి వస్తారు. ఈ ఇద్దరి సమస్యలకు కారణం ఒక్కడే.. అతడే బిజినెస్ మెన్ కాకర్ల విశ్వనాథ్ (సోనూసూద్) అని తెలుసుకుంటాడు. ఆ సమస్యల్లోంచి తన ఫ్రెండ్స్‌ను రాజు ఎలా బయటపడేసాడు.. తన ప్రేమించిన అమ్మాయిని కలుసుకున్నాడా లేదా అనేది అసలు కథ..

కథనం:

నవ్వించడానికి పాత సినిమా అయితే ఏంటి.. కొత్త సినిమా అయితే ఏంటి..? నవ్వించిందా లేదా అనేదే కదా ఇంపార్టెంట్. విశాల్ మదగజరాజా ఈ విషయంలో కొంత వరకు సక్సెస్ అయింది. 12 ఏళ్ళ కిందే విడుదలవ్వాల్సిన సినిమా.. అనుకోని కారణాలతో ఇప్పుడొచ్చి తమిళంలో బ్లాక్‌బస్టర్ కొట్టింది. పాతికేళ్ళ నాటి అదే రొటీన్ కథతో వచ్చింది ఈ సినిమా. కానీ మరీ తీసిపారేసేంత సినిమా అయితే కాదు.. అక్కడక్కడా కడుపుబ్బా నవ్విస్తాడు మదగజరాజా. ఫస్టాఫ్ అంతా వింటేజ్ సంతానం కనిపిస్తాడు. మనోడు చెప్పిన ప్రతీ డైలాగ్‌కు థియేటర్స్‌లో విరగబడి నవ్వేసారు. సెకండాఫ్ దివంగత నటుడు మనోబాల కామెడీ హైలైట్. 15 నిమిషాల శవం ఎపిసోడ్ ఉంటుంది సినిమాలో.. అదైతే హిలేరియస్. పెద్దగా కథంటూ ఏమీ ఉండదు.. అంతా ఫన్‌తోనే వెళ్లిపోతుంది మదగజరాజా. ఆల్రెడీ 12 ఏళ్ళ క్రితం సినిమా.. దాన్ని మరింత పాత కథతో తెరకెక్కించాడు సుందర్ సి. అంటే కథ గురించి అస్సలు పట్టించుకోవద్దన్నమాట. లాజిక్స్ అన్నీ పక్కనబెట్టి హాయిగా కాసేపు కామెడీ ఎంజాయ్ చేస్తామంటే మాత్రం వింటేజ్ సంతానంతో పాటు మనోబాల కామెడీతో కడుపులు చెక్కలైపోతాయి. చెప్పడానికి కథ కూడా ఏమీ లేదు. ఇంటర్వెల్‌కు గానీ అసలు కథ ఓపెన్ అవ్వదు. సెకండాఫ్ అంతా మినిస్టర్ సత్తిబాబు పాత్రలో మనోబాల బాగా నవ్వించారు. ప్రీ క్లైమాక్స్ ఓ పక్క సీరియస్ ట్రాక్ నడుస్తుంటే.. మరో పక్క అదిరిపోయే కామెడీ సీక్వెన్సులు రాసుకున్నాడు సుందర్ సి. కథ, కథనం, లాజిక్స్ ఇవేం పట్టించుకోకపోతే.. 12 ఏళ్ళ కింది సినిమా అనే విషయం మరిచిపోతే హాయిగా ఈ సినిమాను ఎంజాయ్ చేయొచ్చు.

నటీనటులు:

విశాల్ తనకు అలవాటైన మాస్ పాత్రలో బాగా మెప్పించాడు. 12 ఏళ్ళ కింద కాబట్టి అప్పుడు ఇంకా ఫిట్‌గా ఉన్నాడు విశాల్. సిక్స్ ప్యాక్ కూడా చేసాడు అప్పట్లో ఈ సినిమా కోసం. అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ పోటీపడి మరీ గ్లామర్ షో చేసారు. మరీ ముఖ్యంగా వరలక్ష్మి అయితే నెక్ట్స్ లెవల్ గ్లామర్ షో చేసింది. సోనూ సూద్ విలనిజం రొటీన్. సంతానం వింటేజ్ కామెడీ ఇందులో కనిపిస్తుంది. ఇక దివంగత నటుడు మనోబాల సెకండాఫ్‌ను పూర్తిగా లీడ్ చేసారు. ఆయన కనిపించినంత సేపు నవ్వుతూనే ఉంటాం. మిగిలిన పాత్రలు కూడా ఓకే..

టెక్నికల్ టీం:

విజయ్ ఆంటోనీ సంగీతం పరమరోతగా అనిపిస్తుంది. ట్యూన్స్ ఒక్కటి కూడా ఆకట్టుకోవు. విశాల్ పాడిన పాట కాస్త బెటర్. ఎడిటింగ్ షార్ప్‌గా ఉంది. ఎక్కడా పెద్దగా బోర్ కొట్టే సన్నివేశాలైతే లేవు. సినిమాటోగ్రఫీ ఓకే. నిర్మాణ విలువలు పర్లేదు. రొటీన్ టెంప్లేట్ కథనే ఎంటర్‌టైనింగ్‌గా చెప్పాడు దర్శకుడు సుందర్ సి. పాత సినిమా కాబట్టి అప్పటి ట్రెండ్‌కు తగ్గట్లు రాసుకున్నాడు సుందర్.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా మదగజరాజా.. పర్లేదు.. కాసేపు నవ్వుకోవచ్చు..!

డబ్ల్యూపీఎల్ చరిత్రలో తొలిసారి.. ఆర్‌సీబీ ప్లేయర్ చెత్త రికార్డ్
డబ్ల్యూపీఎల్ చరిత్రలో తొలిసారి.. ఆర్‌సీబీ ప్లేయర్ చెత్త రికార్డ్
హాఫ్ సెంచరీలతో చేలరేగిన అటల్, ఒమర్జాయ్.. ఆసీస్ టార్గెట్ ఎంతంటే?
హాఫ్ సెంచరీలతో చేలరేగిన అటల్, ఒమర్జాయ్.. ఆసీస్ టార్గెట్ ఎంతంటే?
ఓర్నాయనో.. బ్రహ్మంగారు చెప్పిందే నిజమవుతోందిగా..!
ఓర్నాయనో.. బ్రహ్మంగారు చెప్పిందే నిజమవుతోందిగా..!
డయాబెటిస్, అధిక బరువు ఉన్నవారు కొబ్బరి నీరు తాగితే ఏమౌతుందో తెలుస
డయాబెటిస్, అధిక బరువు ఉన్నవారు కొబ్బరి నీరు తాగితే ఏమౌతుందో తెలుస
స్టార్ హీరో భార్య గ్రాండ్ పార్టీ.. మెరిసిన బి టౌన్ సెలబ్స్
స్టార్ హీరో భార్య గ్రాండ్ పార్టీ.. మెరిసిన బి టౌన్ సెలబ్స్
భవిష్యత్తును చూసొచ్చిన వ్యక్తి!.. అతడు చెప్తున్న భయంకర విషయాలివే
భవిష్యత్తును చూసొచ్చిన వ్యక్తి!.. అతడు చెప్తున్న భయంకర విషయాలివే
తిమ్మిరితోపాటు కాళ్లల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..?
తిమ్మిరితోపాటు కాళ్లల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..?
అన్నీ అబ్జర్వ్‌ చేస్తున్నా.. నోరు అదుపులో పెట్టుకోండి: చంద్రబాబు
అన్నీ అబ్జర్వ్‌ చేస్తున్నా.. నోరు అదుపులో పెట్టుకోండి: చంద్రబాబు
మసీదులో ఆత్మాహుతి దాడి.. 16 మంది మృతి!
మసీదులో ఆత్మాహుతి దాడి.. 16 మంది మృతి!
నాడు ఒకే ఓవర్లో 7 సిక్సర్లతో 48 పరుగులు.. నేడు ఆసీస్‌పై బీభత్సం
నాడు ఒకే ఓవర్లో 7 సిక్సర్లతో 48 పరుగులు.. నేడు ఆసీస్‌పై బీభత్సం