Tollywood: ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? సినిమా కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకున్న క్రేజీ హీరోయిన్
సాధారణంగా సినిమా హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకోరు. వైవాహిక బంధంలోకి అడుగు పెడితే సినిమా అవకాశాలు తగ్గిపోతాయన్న భావన చాలా మందిలో ఉంది. అయితే ఈ క్రేజీ హీరోయిన్ మాత్రం సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుని అభిమానులకు షాక్ ఇచ్చింది.

పై ఫొటోలో నాన్న పక్కన కూర్చొని ఉన్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఈ అమ్మాయి ఇప్పుడు దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. ఆ మధ్యన హిందీలోనూ కొన్ని సినిమాలు చేసింది. అయితే తెలుగులోనే ఈ ముద్దుగుమ్మ బాగా ఫేమస్. సిద్ధార్థ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, పవన్ కల్యాణ్, రామ్, మంచు విష్ణు వంటి స్టార్ హీరోల సినిమాల్లో యాక్ట్ చేసింది అందాల తార. అందం, అభినయం పరంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే చాలా సినిమాల్లో సెకెండ్ హీరోయిన్ గానే నటించిందీ సొగసరి. అందుకే స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. అందుకే సినిమా కెరీర్ ఉండగానే పెళ్లి చేసుకుని అభిమానులకు షాక్ ఇచ్చింది. అంతే కాదు వెంట వెంటనే ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో మాత్రమే యాక్టివ్ గా ఉంటోంది. మరి ఈ క్యూటీ ఎవరో ఈ పాటికే అర్థమై ఉంటుంది. యస్ ఆమె మరోవరో కాదు టాలీవుడ్ బాపు బొమ్మ ప్రణీతా సుభాష్. గురువారం (అక్టోబర్ 17) ఆమె పుట్టిన రోజు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ ముద్దుగుమ్మకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అలాగే ప్రణీతకు సంబంధించి చిన్ననాటి ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా ట్రెండ్ అవుతున్నాయి.
సిద్ధార్థ్ నటించిన బావ సినిమాతో తెలుగు ఇండస్డ్రీకి పరిచయమైంది కన్నడ ముద్దుగుమ్మ ప్రణీత. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాతో ఇక్కడి వారికి బాగా చేరువైంది. ఆ తర్వాత ఎన్టీఆర్, మహేశ్ బాబు సినిమాల్లోనూ నటించింది.
ప్రముఖుల నుంచి బర్త్ డే విషెస్
Sending birthday wishes to the gorgeous actress @pranitasubhash! Have a beautiful year ahead.🥳#HBDPranithaSubhash pic.twitter.com/9fp9JZbi5B
— Aditya Music (@adityamusic) October 17, 2024
ఇక సినిమాల సంగతి పక్కన పెడితే.. ప్రణీత సుభాష్ . బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజును వివాహం చేసుకుంది. 2021 మే 30వ తేదీన వీరి వివాహం బెంగళూరులో జరిగింది. తమ వైవాహక బంధానికి ప్రతీకగా 2022లో మొదటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించారీ లవ్లీకపుల్. ఆ ఆ పాపకు అర్నా అని పేరు పెట్టారు. ఇటీవలే ప్రణీత మరో మగ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం వీరిద్దరి అలనాపాలనతో బిజీగా ఉంటోందీ అందాల తార.
@pranitasubhash Happy Birthday Dear ❤️🔥 pic.twitter.com/q93RsMZ3K5
— . (@Ravissmbfan) October 17, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




