Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అర్జున్ చేతిలో ఉన్న పిల్లోడిని గుర్తు పట్టారా? సినిమా ఇండస్ట్రీని ఏలాల్సినోడు.. అర్ధంతరంగా..

తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తూ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. బాలనటుడిగా ఉన్నప్పుడే జాతీయ అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత హీరోగానూ మారి వరుస విజయాలు సొంతం చేసుకున్నాడు. తన నటన, సేవా కార్యక్రమాలతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.

Tollywood: అర్జున్ చేతిలో ఉన్న పిల్లోడిని గుర్తు పట్టారా? సినిమా ఇండస్ట్రీని ఏలాల్సినోడు.. అర్ధంతరంగా..
Actor Ajun
Follow us
Basha Shek

|

Updated on: Mar 17, 2025 | 10:11 AM

పై ఫొటోలో యాక్షన్ కింగ్ అర్జున్ చేతిలో ఉన్న పిల్లాడిని గుర్తు పట్టారా? అతను రీల్ లైఫ్ తో పాటు రియల్ లైఫ్ లోనూ సూపర్ స్టార్. దిగ్గజ నటుడైన తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తూ బాల నటుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. తన నటనా ప్రతిభకు చిన్నప్పుడు ఉత్తమ బాల నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్నాడు. ఆ తర్వాత హీరోగానూ ఎంట్రీ ఇచ్చి వరుస విజయాలు సొంతం చేసుకున్నాడు. తన అసమాన నటనా ప్రతిభతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. కేవలం సినిమాలే కాకుండా మంచి వ్యాపార వేత్తగానూ ప్రూవ్ చేసుకున్నాడు. వీటన్నిటిని పక్కన పెడితే.. తన సేవా కార్యక్రమాలతో సాధారణ జనాలకు సైతం అభిమాన నటుడిగా మారిపోయాడీ హీరో. అనాథల కోసం అనాథశ్రమాలు, విద్యార్థుల కోసం పాఠశాలలు, వసతి గృహాలు, వృద్ధా శ్రమాలు, గోశాలలు.. ఇలా అందరి బాగు కోసం పాటు పడ్డాడు. కానీ కాలం ఈ నటుడిని చాలా చిన్న చూపు చూసింది. రీల్ లైఫ్ తో పాటు రియల్ లైఫ్ లోనూ సూపర్ స్టార్ గా వెలుగొందుతోన్న అతనిని తనలో కలిపేసుకుంది. సినిమా ఇండస్ట్రీలో రారాజుగా ఉండాల్సినోడు 46 ఏళ్లకే ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయిన ఈ హీరో మరెవరో కాదు దివంగత పునీత్ రాజ్ కుమార్.

సోమవారం (మార్చి 17) పునీత్ రాజ్ కుమార్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అతని కుటుంబ సభ్యులు, బంధువులు, సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ దివంగత నటుడిని గుర్తు చేసుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా పునీత్ కు నివాళి అర్పిస్తున్నారు. ఇక కర్ణాటక వ్యాప్తంగా తమ అభిమాన హీరో పేరిట అన్నదానం, రక్త దానం వంటి సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు పునీత్ అభిమానులు.

ఇవి కూడా చదవండి

పునీత్ రాజ్‍కుమార్ 2002లో అప్పూ సినిమాతో హీరోగా పరిచయమయ్యాు. తన 45 ఏళ్ల సినీ జీవితంలో 32 సినిమాల్లో నటించాడు. సినిమాల సంగత పక్కన పెడితే.. ‌ 45 ఉచిత పాఠశాలలను ఏర్పాటు చేసి 1800 మంది విద్యార్థుల‌కు చ‌దువు చెప్పించాడు పునీత్. అలాగే 26 అనాథ ఆశ్ర‌మాలు, 16 వృద్ధాశ్రమాలు, 19 గోశాల‌లు ఏర్పాటు చేశాడు. అందుకే నాలుగేళ్ల క్రితం ఈ హీరో లోకాన్ని విడిచి వెళ్లిపోయినా ఇప్పటికే అభిమానుల గుండెల్లో చిర స్థాయిగా నిలిచిపోయాడు.

ప్రముఖుల నివాళులు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

APPSC డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ మెయిన్స్‌ పరీక్షల తేదీలు ఇవే
APPSC డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ మెయిన్స్‌ పరీక్షల తేదీలు ఇవే
Horoscope Today: ఆ రాశి ఉద్యోగుల శ్రమకు, ప్రతిభకు గుర్తింపు..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగుల శ్రమకు, ప్రతిభకు గుర్తింపు..
ఐపీఎల్ ప్రారంభోత్సవంలో సందడి చేసే స్టార్స్ వీరే
ఐపీఎల్ ప్రారంభోత్సవంలో సందడి చేసే స్టార్స్ వీరే
ఏపీలో మొదటి మదర్స్ మిల్క్ బ్యాంక్‌ను ప్రారంభించిన మహేష్.. ఫొటోస్
ఏపీలో మొదటి మదర్స్ మిల్క్ బ్యాంక్‌ను ప్రారంభించిన మహేష్.. ఫొటోస్
రాత్రిపూట చియా సీడ్స్‌ వాటర్ తాగుతున్నారా..? ఏమౌతుందో తెలిస్తే..
రాత్రిపూట చియా సీడ్స్‌ వాటర్ తాగుతున్నారా..? ఏమౌతుందో తెలిస్తే..
సమస్యలు వినడమే కష్టమనుకుంటే.. అన్నం కూడా పెడుతున్నారే..!
సమస్యలు వినడమే కష్టమనుకుంటే.. అన్నం కూడా పెడుతున్నారే..!
మీ ఇంట్లో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడుతున్నారా..?
మీ ఇంట్లో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడుతున్నారా..?
చిటికెడు పసుపుతో బోలేడు లాభాలు.. ఇలా చేస్తే ఈజీగా బరువు తగ్గుతారట
చిటికెడు పసుపుతో బోలేడు లాభాలు.. ఇలా చేస్తే ఈజీగా బరువు తగ్గుతారట
: ఇబ్బందుల్లో హృతిక్ రోషన్ క్రిష్ 4.. బిగ్ షాక్ ఇచ్చిన నిర్మాత
: ఇబ్బందుల్లో హృతిక్ రోషన్ క్రిష్ 4.. బిగ్ షాక్ ఇచ్చిన నిర్మాత
ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు ఇవే.. పలు బిల్లులకు ఆమోదం..!
ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు ఇవే.. పలు బిల్లులకు ఆమోదం..!