AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss: బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ లో బిగ్ బాస్ తెలుగు విన్నర్! వీడియోలు రిలీజ్ చేసిన అన్వేష్‌.. కేసు నమోదు!

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తోన్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే సన్నీ యాదవ్, హర్షసాయి వంటి ఫేమస్ యూట్యూబర్లపై కేసులు నమోదయ్యాయి. అయితే ఇదే విషయంలో బిగ్ బాస్ తెలుగు విన్నర్ పై కూడా కేసు నమోదు కానుందని తెలుస్తోంది.

Bigg Boss: బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ లో బిగ్ బాస్ తెలుగు విన్నర్! వీడియోలు రిలీజ్ చేసిన అన్వేష్‌.. కేసు నమోదు!
Bigg Boss
Basha Shek
|

Updated on: Mar 17, 2025 | 10:05 AM

Share

బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ పై పోలీసులు గట్టి నిఘా ఉంచుతున్నారు. డబ్బు కోసం వీటిని ప్రమోట్ చేస్తోన్న సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లపై పోలీసులు వరుసగా కేసు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. వీటిని ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లను సోషల్ మీడియా వేదికగా ఎండగడుతున్నారు. ఈక్రమంలో ఇప్పటికే ప్రముఖ తెలుగు ఫేమస్ యూట్యూబర్లైన భయ్యా సన్నీ యాదవ్, హర్ష సాయి తదితరులపై కేసులు నమోదు చేశారు సైబరాబాద్ పోలీసులు. కాగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై వరుసగా కేసులు నమోదు అవుతుండడంతో మరికొందరు సెలబ్రిటీలు ముందు జాగ్రత్త పడుతున్నారు. తమ పేజీలను డిలీట్ చేస్తున్నారు. అలాగే సురేఖ వాణి, సుప్రిత, రీతౌ చౌదరి లాంటి సినీ ప్రముఖులు కూడా తమ తప్పులు తెలసుకుని క్షమాపణలు చెబుతూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు.

కాగా ఈ ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో బిగ్ బాస్ టైటిల్ విన్నర్, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో పల్లవి ప్రశాంత్ క్రికెట్ ఓ క్రికెట్ ప్రెడిక్షన్స్ యాప్ ని బాగా ప్రమోట్ చేస్తూ వీడియోలు కూడా చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం బెట్టింగ్ యాప్ నిర్వాహకుల నుంచి పెద్ద మొత్తంలోనే డబ్బులు అందుకున్నట్లు సమాచారం. ఇటీవల ప్రముఖ టూరిస్ట్ వ్లోగర్ అన్వేష్ ఈ విషయాన్ని బయట పెట్టాడు. పల్లవి ప్రశాంత్ చేసిన బెట్టింగ్ యాప్ వీడియోలని తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ లో షేర్ చేశాడు. దీంతో రైతు బిడ్డపై కూడా త్వరలోనే పోలీసు కేసు నమోదు కానున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

పల్లవి ప్రశాంత్ లేటెస్ట్ ఫొటోస్..

కాగా రైతు బిడ్డ ట్యాగ్ తో బిగ్ బాస్  తెలుగు సీజన్ 7 లోకి అడుగు పెట్టాడు పల్లవి ప్రశాంత్. తన ఫ్యాన్  ఫాలోయింగ్ తో ఏకంగా బిగ్ బాస్ టైటిల్ కూడా సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం  పల్లవి ప్రశాంత్ కు సోషల్ మీడియాలో సుమారు 20 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

కుటుంబ సభ్యులతో రైతు బిడ్డ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై