ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హీరోయిన్.. వ్యభిచార కేసులో చిక్కుకొని కేరీర్ నాశనం.. ఇప్పుడు ఇలా
విక్టరీ వెంకటేష్ తన కెరీర్ లో ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించారు. ఇకవెంకీ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటించి మెప్పించిన కామెడీ ఎంటర్టైనర్స్ లో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా ఒకటి. ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది.

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు సినిమా ఒకటి. 1996 లోశ్రీ దుర్గాఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్.నారాయణ నిర్మించిన ఈ చిత్రానికి ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించారు. దగ్గుబాటి వెంకటేష్ తో పాటు సౌందర్య, వినీత ముఖ్య పాత్రలు పోషించారు.సంగీతం కోటి సమకూర్చారు . ఈ సినిమాలోని పాటలన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ సినిమాలో వెంకటేష్ నటన, కామెడీ టైమింగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా కోట శ్రీనివాసరావు , వెంకటేష్ మధ్య వచ్చే సీన్స్ సినిమాకే హైలైట్ అనే చెప్పాలి. కాగా ఈ సినిమాలో సౌందర్యంతో పాటు నటించిన మరో నటి గుర్తుందా.? నేపాలీ అమ్మాయిగా కనిపించిన ఆమె పేరు వినీత. ఆమె ఎన్నో సినిమాల్లో నటించింది.
సుమారు 70కి పైగా సినిమాల్లో నటించిన ఆమె ఊహించని విధంగా సినిమాలకు దూరం అయ్యింది. అయితే ఆమె కెరీర్ ను చేతులారా పడు చేసుకుందని అంటున్నారు. వినీత పేరు అప్పట్లో బాగా పాపులర్. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసింది. స్టార్ హీరోల సరసన సినిమాలు చేసిన ఆమె వ్యభిచార కేసులో చిక్కుకుంది. 2003లో వినీత వ్యభిచార కేసులో చిక్కుకుంది.
2003లో కొందరి ఫిర్యాదుతో వినీత పై పోలీస్లు వ్యభిచార కేసు నమోదు చేశారు. తల్లి, సోదరుడితో కలిసి ఆమె ఈ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. దాంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. కాగా 2004లో ఆమెకు అనుకూలంగా కోర్టు తీర్పు వెళ్లడించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు ఎలా నమోదు చేస్తారు అంటూ కోర్టు సీరియస్ అయ్యింది. ఆమె పై వచ్చిన అభియోగాలను, కేసును కోర్టు కొట్టేసింది. కానీ అప్పటికే ఆమెకు ఆఫర్స్ తగ్గడం మొదలయ్యాయి. ఈ వ్యవహారం తర్వాత ఆమెకు పూర్తిగా సినిమాలు తగ్గిపోయాయి. విచారణ పేరుతో తనను వేధించారని ఆమె పేర్కొన్నారు. కావాలనే తన పేరును నాశనం చేయడానికి పోలీసులు తప్పుడు కేసు పెట్టరని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆతర్వాత వినీతకు సినిమా ఛాన్సులు ఎవరూ ఇవ్వలేదు. దాంతో ఆమె ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆతర్వాత ఆమె రీ ఎంట్రీ ఇచ్చి చిన్న చిన్న పాత్రలు చేస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..