Tollywood: తాతేమో ప్రధాన మంత్రి.. భర్తేమో స్టార్ హీరో.. ఈ పాన్ ఇండియా హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ మాములుగా లేదుగా..
సాధారణంగా సినిమా హీరోయిన్లకు అంతో ఇంతో బ్యాక్ గ్రౌండ్ ఉంటుంది. కానీ ఈ ముద్దుగుమ్మకు ఉన్నంత బ్యాక్ గ్రౌండ్ భారతీయ సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోయిన్‌కు ఉండదు. అయితే అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ సినిమా ఇండస్ట్రీలో సొంతకాళ్లపై నిలబడిందీ అందాల తార. పాన్ ఇండియా హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది.
పై ఫొటోలో ఉన్న అమ్మకూచిని గుర్తు పట్టారా? ఈ అమ్మాయి ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ ఆడియెన్స్ ను అలరిస్తోందీ అందాల తార. తన అందం, అభినయంతో అటు దక్షిణాదిలోనూ, ఇటు నార్త్‌లోనూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. అయితే ప్రొఫెషనల్ లైఫ్ లో సక్సెస్ అయినట్లు పర్సనల్ లైఫ్ లో సక్సెస్ కాలేకపోయిందీ సొగసరి. అందుకే మొదటి పెళ్లి ఆరేళ్లకే పెటాకులైంది. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో బిజీ అయిన ఈ బ్యూటీ ఇటీవలే రెండో పెళ్లి చేసుకుంది. భార్యతో విడాకులు తీసుకుని విడిపోయిన ఓ దక్షిణాది స్టార్ హీరోతో కలిసి సింపుల్ గా పెళ్లిపీటలెక్కింది. ప్రస్తుతం ఈ జోడీ తన మ్యారీడ్ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఈ క్యూటీ ఎవరో ఈ పాటికే అర్థమై ఉంటుంది. యస్.. తను మరెవరో కాదు స్టార్ హీరోయిన్ అదితీ రావ్ హైదరి. సోమవారం (అక్టోబర్ 28) ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ క్రేజీ హీరోయిన్ కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అదే సమయంలో అదితీ రావు పాత ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి.
కాగా అదితీ రావు హైదరి రాజుల వంశానికి చెందిన అమ్మాయి. ఆమె తాత (తండ్రి తండ్రి) అక్బర్ హైదరీ.. అప్పట్లో హైదరాబాద్ ప్రధానమంత్రిగా చేశారు. అలాగే మరో తాత రామేశ్వరరావ్ (తల్లి తండ్రి) తెలంగాణలోని వనపర్తి సంస్థానాధీశునిగా ఉన్నా బాధ్యతలు నిర్వర్తించారు.ఇక బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మాజీ భార్య, దర్శకురాలు కిరణ్ రావ్ కూడా అదితీకి దగ్గరి బంధువు అవుతుంది. అయితే అదితీ రెండేళ్ల వయసు ఉన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోయారు. దీంతో ఆమె తల్లితో కలిసి ఢిల్లీ వచ్చేసింది. అక్కడే పెరిగింది. 2006లో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన అదితీ.. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో నటించింది. ఇక తెలుగులో ఆమె నటించిన సమ్మోహనం, అంతరిక్షం, వి, మహా సముద్రం సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.
సిద్ధార్థ్ తో అదితీ రావు హైదరి..
View this post on Instagram
ఇక మహా సముద్రం షూటింగ్ సమయంలోనే నటుడు సిద్ధార్థ్ తో ప్రేమలో పడింది అదితి. కొన్నేళ్లు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట ఇటీవలే ఏడడుగులు నడిచారు. గతంలో హిందీ నటుడు సత్యదీప్ మిశ్రాని 2007లో అదితీ పెళ్లి చేసుకుంది. అయితే ఆరేళ్లకే విడాకులు తీసుకుని విడిపోయారు.
సిద్ధార్థ్, అదితీల రొమాంటిక్ ఫొటోస్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.