- Telugu News Photo Gallery Cinema photos Director Nag ashwin and Prabhas Kalki 2898 AD Movie part 2 update, details here Telugu Heroes Photos
Kalki 2 Update: అబ్బా.! ఎమన్నా ప్లాన్ చేసావా నాగి.. రెబల్ సైన్యానికి అదిరిపోయే న్యూస్.!
ప్రభాస్ స్పీడుమీదున్నారా? ఆయనతో పనిచేసే కెప్టెన్లు అలా పరుగులు తీయిస్తున్నారా? ఇంటర్ లింక్డ్ క్వశ్చన్ ఇది. ఇప్పుడున్న కమిట్‌మెంట్స్ కంప్లీట్ చేయాలంటే ఆయన స్పీడూ చూపించకతప్పదు. వీళ్లు పరుగులూ తీయించక తప్పదు.. అని అంటోంది ఇండస్ట్రీ. డార్లింగ్ సినిమాల గురించి ఎప్పుడెప్పుడు అప్‌డేట్ వస్తుందా అని ఇంట్రస్టింగ్‌గా వెయిట్ చేస్తున్న రెబల్ సైన్యానికి అదిరిపోయే న్యూస్ వచ్చేసింది.
Updated on: Oct 28, 2024 | 3:03 PM

1000 కోట్లు అంటే ఒకప్పుడు చాలా పెద్దగా కనిపించేది.. కానీ దాన్ని కూడా మన హీరోలు మామూలు కలెక్షన్స్‌లా మార్చేస్తున్నారు. ఇప్పటికే తెలుగులో ప్రభాస్ రెండుసార్లు..

ఇప్పుడున్న కమిట్‌మెంట్స్ కంప్లీట్ చేయాలంటే ఆయన స్పీడూ చూపించకతప్పదు. వీళ్లు పరుగులూ తీయించక తప్పదు.. అని అంటోంది ఇండస్ట్రీ.

డార్లింగ్ సినిమాల గురించి ఎప్పుడెప్పుడు అప్‌డేట్ వస్తుందా అని ఇంట్రస్టింగ్‌గా వెయిట్ చేస్తున్న రెబల్ సైన్యానికి అదిరిపోయే న్యూస్ వచ్చేసింది.

కల్కి సీక్వెల్ గురించి వండర్‌ఫుల్ అప్‌డేట్ ఇచ్చేశారు కెప్టెన్ నాగ్ అశ్విన్. డార్లింగ్‌తో చేయబోయే సినిమా మామూలుగా ఉండదంటూ ఫ్యాన్స్ ని ఊరించారు నాగీ. నెక్స్ట్ నేను చేసే సినిమా కల్కి2.

అది చాలా భారీ సినిమా. రెండు, మూడు సినిమాలకు ఎంత కష్టపడతానో, కల్కి2కి అంత శ్రమ చేయాలి. అందుకే కాస్త సమయం పడుతుందన్నది నాగీ చెప్పిన మాట.

ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ షిఫ్టులతో సినిమాలు చేస్తున్న డార్లింగ్‌ని కాసింత ఊపిరి తీసుకోమన్నట్టే లెక్క. ఎట్టి పరిస్థితుల్లోనూ నెక్స్ట్ ఇయర్ కల్కి2కి ముహూర్తం పెట్టేస్తారనే మాట కూడా వినిపిస్తోంది.

కాకపోతే ఆ ముహూర్తం 2025 ఫస్టాఫ్‌లో ఉంటుందా? సెకండాఫ్‌లో ఉంటుందా? అనేదే చర్చ. ఇప్పుడు నాగీ చెప్పిన మాటల ప్రకారం సెకండాఫ్‌లోనే ఉంటుందని ఫిక్సయిపోవచ్చేమో.!





























