- Telugu News Photo Gallery Cinema photos Pan India Films shooting will be starts on Sankranthi festival
Movie Updates: ఇప్పటివరకు ఓ లెక్క… ఇక మీద ఒక లెక్క.. పండక్కి షూటింగ్స్ సందడి..
దాదాపు ఏడాది కాలంగా సెట్‌కు దూరంగా ఉన్న దర్శకులు... ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నారు. మరో రెండు నెలల్లో రెడీ యాక్షన్ చెప్పేందుకు రెడీ అంటున్నారు. అది కూడా పాన్ ఇండియా రేంజ్‌లో బిగ్ మూవీస్ కావటంతో ఆడియన్స్‌లోనూ ఆ సినిమాల అప్‌డేట్ కోసం క్యూరియస్‌గా ఎదురుచూస్తున్నారు.
Updated on: Oct 28, 2024 | 3:52 PM

శంకర్ ఎడిటింగ్ ఫైనల్ చేయడంలో బిజీగా ఉంటే, టీజర్ లాంఛ్ ప్రోగ్రామ్‌ని ముందుండి నడిపించారు నిర్మాత దిల్‌రాజు.

ప్రజెంట్ ది రాజాసాబ్ వర్క్‌లో బిజీగా ఉన్న ప్రభాస్ కూడా జనవరి నుంచి హను రాఘవపూడి మూవీ షూటింగ్‌లో పాల్గొంటారు. తర్వాత మరి కొన్ని రోజు కల్కి 2, సలార్ 2, స్పిరిట్ షూటింగ్స్ కూడా స్టార్ట్ అవుతాయి.

దేవర రిలీజ్ తరువాత బ్రేక్ తీసుకోకుండా వార్ 2 సెట్‌లో అడుగుపెట్టిన ఎన్టీఆర్, ఆ తరువాత కూడా నో బ్రేక్ అంటున్నారు. జనవరి నుంచి ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నారు.

ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహేష్, రాజమౌళి సినిమా జనవరి నుంచి స్టార్ట్ కానుంది. ఆల్రెడీ లొకేషన్ సెర్చ్‌లో ఉన్న జక్కన్న త్వరలో షూటింగ్ షురూ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే మేకోవర్ అవుతున్న మహేష్, జనవరి నుంచి షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు.

ప్రజెంట్ పుష్ప షూటింగ్‌లో ఉన్న అల్లు అర్జున్ కూడా నెక్ట్స్ మూవీ విషయంలో క్లారిటీ ఇచ్చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా కూడా జనవరిలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. గతంలో ఈ కాంబినేషన్‌లో వచ్చిన అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్ అయ్యింది. ఇప్పుడు పాన్ ఇండియా హిట్ మీద ఫోకస్ చేస్తున్నారు బన్నీ, త్రివిక్రమ్.




