Tollywood: ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా ?.. ఆరాధ్య దేవతకు గుడి కట్టిన అభిమానులు..
ఇప్పటికే పలువురు తారల చైల్డ్ హుడ్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మీ ముందుకు మరో తార చిన్ననాటి ఫోటోను తీసుకువచ్చాం. అందులో ఉన్న కథానాయికను గుర్తుపట్టారా ?.. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరించింది. తమిళం, తెలుగు భాషల్లో అనేక సినిమాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఎవరో గుర్తుపట్టారా ?..

నిత్యం సోషల్ మీడియాలో స్టార్ హీరోహీరోయిన్స్ చిన్ననాటి ఫోటోస్ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు తారల చైల్డ్ హుడ్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మీ ముందుకు మరో తార చిన్ననాటి ఫోటోను తీసుకువచ్చాం. అందులో ఉన్న కథానాయికను గుర్తుపట్టారా ?.. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరించింది. తమిళం, తెలుగు భాషల్లో అనేక సినిమాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఎవరో గుర్తుపట్టారా ?.. తనే సీనియర్ హీరోయిన్ ఖుష్బూ. ఇప్పుడు ఆమె చిన్ననాటి ఫోటో ఇప్పుడు తెగ షేర్ చేస్తున్నారు నెటిజన్స్.
ఖుష్బూ అసలు పేరు నకత్ ఖాన్. ముంబైకి చెందిన ముస్లిం కుటుంబంలో 1970లో సెప్టెంబర్ 29న జన్మించారు. బాలనటిగా అరంగేట్రం చేసినప్పుడు, అతని తల్లిదండ్రులు అతనికి ఖుష్బూ అని పేరు పెట్టారు. చిన్నతంబిలో ఖుష్బీ నటనకు మంచి మార్కులే పడ్డాయి. కలియుగ పాండవులు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఖుష్బూ. ఇందులో వెంకటేష్ హీరోగా నటించారు. ఆ తర్వాత పేకాట పాపారావు, స్టాలిన్, రాక్షస సంహారం, జయసింహ, తేనెటీగ, పెద్దన్న, రామబాణం సినిమాల్లో నటించింది ఖుష్బూ. అటు తమిళంలోనూ అనేక చిత్రాల్లో నటించింది.
View this post on Instagram
చిన్నతంబి సినిమా చేస్తున్న సమయంలో నటుడు ప్రభుతో ప్రేమలో పడింది ఖుష్బూ. ఆ తర్వాత 1993 సెప్టెంబర్ 12న పోయెస్ గార్డెన్ లో ఉన్న వీరి ఇంట్లో ఖుష్బూ, ప్రభు వివాహం జరిగింది. అయితే వీరి పెళ్లిని ప్రభు సతీమణి, ఆయన తండ్రి శివాజీ గణేషన్ వ్యతిరేకించారు. దీంతో నాలుగు నెలల్లోనే వీరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2000లో ఆమె సినీ నటుడు దర్శకుడు సుందర్ సిని వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
View this post on Instagram
ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లోనూ వరుస సినిమాలు చేస్తుంది ఖుష్బూ. ఓవైపు రాజకీయాల్లో కొనసాగుతూనే ఇటు సినిమాల్లో సహాయ పాత్రలు చేస్తుంది. అలాగే బుల్లితెరపై పలు షోలకు జడ్జీగా వ్యవహరిస్తుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
