- Telugu News Photo Gallery Cinema photos Upcoming Periodic Movies in Tollywood news goes interesting Telugu Entertainment Photos
Periodic Movies: రానున్న పిరాడమిక్ సినిమాలపై క్రియేట్ అవుతున్న బజ్..
హిట్ కొట్టాలంటే హిస్టారికల్ కథలు తప్ప మరో ఆప్షన్ లేదా..? ఈ డౌట్ ఎందుకొచ్చిందిప్పుడు అనుకోవచ్చు..? మరి రాదా చెప్పండి.. ఏదో ఒక్క హీరో అంటే ఏమో అనుకోవచ్చు.. అరే ప్రతి హీరో పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్ ఎంచుకుంటుంటే అనుమానాలు కాక ఇంకేం వస్తాయి చెప్పండి..? అసలు హిట్ కోసం హిస్టరీ తవ్వుతున్న హీరోలెవరో చూద్దాం పదండి ఓసారి..
Updated on: Sep 29, 2023 | 8:40 PM

హిట్ కొట్టాలంటే హిస్టారికల్ కథలు తప్ప మరో ఆప్షన్ లేదా..? ఈ డౌట్ ఎందుకొచ్చిందిప్పుడు అనుకోవచ్చు..? మరి రాదా చెప్పండి.. ఏదో ఒక్క హీరో అంటే ఏమో అనుకోవచ్చు.. అరే ప్రతి హీరో పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్ ఎంచుకుంటుంటే అనుమానాలు కాక ఇంకేం వస్తాయి చెప్పండి..?

అసలు హిట్ కోసం హిస్టరీ తవ్వుతున్న హీరోలెవరో చూద్దాం పదండి ఓసారి.. ఈ మధ్య ఏ హీరోను తీసుకున్నా కూడా చరిత్రను తవ్వండి అంటున్నారు. కనీసం 20-30 ఏళ్ళు వెనక్కి వెళ్లకుండా దర్శకులు కూడా కథలు రాయలేకపోతున్నారు.

పైగా పీరియాడిక్ సినిమాలకు సక్సెస్ పర్సెంటేజ్ ఉంది. ఈ మధ్య వచ్చిన సార్, ఉప్పెన, ట్రిపుల్ ఆర్, రంగస్థలం, పుష్ప ఇవన్నీ ఇప్పటి సినిమాలు కావు.. అన్నీ పాతికేళ్ల నుంచి 50 ఏళ్ల నాటి కథలే.

ఈ మధ్యే వరుణ్ తేజ్, కరుణ కుమార్ కాంబినేషన్‌లో మట్కా సినిమా ఓపెన్ అయింది.వైరా ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 1970స్ నేపథ్యంలో వస్తుంది. టైటిల్‌లోనే చాలా హింట్స్ ఇచ్చారు దర్శకుడు కరుణ కుమార్.

1975 నాటి రూపాయి కాయిన్.. 5 రూపాయల నోట్లు.. పాత కారు.. వెనక నోట్ల కట్టలు.. ఇవన్నీ చూస్తుంటే ఇదేదో మాఫియా కథ అని అర్థమవుతుంది. వైజాగ్ నేపథ్యంలో ఈ కథ సాగుతుందని తెలుస్తుంది.

రామ్ చరణ్ సైతం వరసగా పీరియాడిక్ కథల వైపు అడుగులేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ 1920స్ బ్యాక్‌డ్రాప్‌లో రాగా.. శంకర్, బుచ్చిబాబు సినిమాల్లో 1940స్ నేపథ్యం ఉంది.

బాలయ్య, బాబీ సినిమాతో పాటు.. పవన్ కళ్యాణ్ ఓజి 1980స్ నేపథ్యంలోనే వస్తున్నాయి. పుష్ప 2 గురించి చెప్పనక్కర్లేదు. ఇలా తెలుగు ఇండస్ట్రీ అంతా ఇప్పుడు పీరియాడిక్ ట్రెండ్ వెంట నడుస్తుంది.





























