- Telugu News Photo Gallery Cinema photos Telugu Heroes Ads recent trends in Tollywood Telugu Heroes Photos
Telugu Heroes Ads: సినిమాలు , యాడ్స్ రెండూ కుమ్మేస్తున్న ట్రేండింగ్ సౌత్ హీరోలు..
మన హీరోలకు సినిమాలు చేయడానికే టైమ్ సరిపోవడం లేదనుకుంటున్నారంతా. కానీ మనోళ్ల ప్లానింగ్ నెక్ట్స్ లెవల్‌లో ఉంది.. అవ్వా బువ్వా రెండూ కావాలన్న టైప్‌లో ఇటు సినిమాలు, అటు యాడ్స్ కుమ్మేస్తున్నారు. డేట్స్ విషయంలో ఎక్కడా ఏ చిన్న ప్రాబ్లమ్ కూడా రాకుండా జాగ్రత్త పడుతున్నారు. మరి అలాంటి మేనేజింగ్ స్టార్స్ ఎవరో చూసేద్దామా..? ఈ పాట బన్నీ ఒక్కరే కాదు..
Updated on: Sep 29, 2023 | 9:05 PM

Allu Arjun Stylish

డేట్స్ విషయంలో ఎక్కడా ఏ చిన్న ప్రాబ్లమ్ కూడా రాకుండా జాగ్రత్త పడుతున్నారు. మరి అలాంటి మేనేజింగ్ స్టార్స్ ఎవరో చూసేద్దామా..? ఈ పాట బన్నీ ఒక్కరే కాదు.. మిగిలిన హీరోలందరూ పాడుకుంటున్నారు.

తగ్గేదే లే అంటూ ఇటు సినిమాలు, అటు యాడ్స్‌లో కుమ్మేస్తున్నారు. రెండు చోట్లా తమ మార్క్ చూపిస్తున్నారు. ఓ వైపు పుష్ప2తో బిజీగా ఉంటూనే.. సడన్‌గా క్రిష్‌తో సినిమా అనౌన్స్ చేసి షాకిచ్చారు బన్నీ.

తీరా చూస్తే అది సినిమా కాదు యాడ్ అని అర్థమవుతుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. పుష్పతో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన అల్లు అర్జున్.. యాడ్స్ కూడా అలాగే చేస్తున్నారు. ఈయన కమర్షియల్ బ్రాండ్ వ్యాల్యూ బాగా పెరిగిపోయింది.

దాంతో బాలీవుడ్ నుంచి కూడా ఆహ్వానాలు అందుతున్నాయి. మరోవైపు మహేష్ బాబు గుంటూరు కారంతో అంత బిజీగా ఉంటూనే.. మరోవైపు యాడ్స్ షూటింగ్‌లోనూ తరుచూ పాల్గొంటున్నారు. ఈ మధ్యే ఓ కొత్త యాడ్ షూట్ చేసారు మహేష్.

దేవరతో ఎంత బిజీగా ఉన్నా.. తన ఎండోర్స్‌మెంట్ విషయంలో మాత్రం నో కాంప్రమైజ్ అంటున్నారు జూనియర్ ఎన్టీఆర్. అందుకే ఇటు సినిమాలతో పాటు అటు యాడ్స్ రంగంలోనూ రప్ఫాడిస్తున్నారు.

రామ్ చరణ్, విజయ్ దేవరకొండ లాంటి హీరోల చేతుల్లోను అరడజన్ బ్రాండింగ్స్ ఉన్నాయి. మొత్తానికి మన హీరోలు సినిమాలతో పాటు యాడ్స్‌లోనూ కుమ్మేస్తున్నారు.
