Tollywood: ఒక్క సినిమాతోనే సెన్సెషన్ అయ్యింది.. లవ్ ఫెయిల్యూర్ అబ్బాయిలు ఠక్కున గుర్తుపట్టేస్తారు.. ఎవరో చెప్పండి..
తొలి చిత్రానికే సూపర్ హిట్ అందుకుని.. ఓవర్ నైట్ సెన్సెషన్ అయ్యారు. ఆ తర్వాత మాత్రం తెలుగులో మరో సినిమా చేయకుండా సైలెంట్ అయ్యారు. అలాంటి హీరోయిన్స్ జాబితాలో పైన కనిపిస్తున్న ముద్దుగుమ్మ ఒకరు. ఆమె తెలుగులో కేవలం ఒక్క సినిమా మాత్రమే చేసింది. తొలి సినిమాకే గుర్తింపు సంపాదించింది. ఎవరో గుర్తుపట్టారా ?.. తనే హీరోయిన్ నితీ టేలర్. ఈ పేరు చెబితే గుర్తుపట్టడం కష్టమే..

తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు అందం, అభినయంతో మెప్పించారు. కొందరు వరుస సినిమాలు చేస్తూ తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగి అగ్ర హీరోలతో సినిమాలు చేసి ఓ వెలుగు వెలిగారు. కానీ కొందరు మాత్రమే ఒకటి రెండు చిత్రాలు చేసి ఇండస్ట్రీకి దూరమయ్యారు. కానీ చేసిన ఒక్క సినిమాతోనే పాపులారిటీని సంపాదించుకున్నారు. తొలి చిత్రానికే సూపర్ హిట్ అందుకుని.. ఓవర్ నైట్ సెన్సెషన్ అయ్యారు. ఆ తర్వాత మాత్రం తెలుగులో మరో సినిమా చేయకుండా సైలెంట్ అయ్యారు. అలాంటి హీరోయిన్స్ జాబితాలో పైన కనిపిస్తున్న ముద్దుగుమ్మ ఒకరు. ఆమె తెలుగులో కేవలం ఒక్క సినిమా మాత్రమే చేసింది. తొలి సినిమాకే గుర్తింపు సంపాదించింది. ఎవరో గుర్తుపట్టారా ?.. తనే హీరోయిన్ నితీ టేలర్. ఈ పేరు చెబితే గుర్తుపట్టడం కష్టమే.. కానీ వన్ ఆఫ్ ది లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ‘వెళ్లిపోవే.. వెళ్లిపోవే ‘అనే సాంగ్ వింటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు.
2012లో వచ్చిన ‘మేం వయసుకు వచ్చాం’ సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైంది. ఇందులో తనీష్ హీరోగా నటించగా.. నితీ టేలర్ కథానాయికగా నటించింది. డైరెక్టర్ త్రినాధరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందించారు. అప్పట్లో ఈ మూవీ అంతగా మెప్పించకపోయినా.. ఇందులో లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ‘వెళ్లిపోవే.. వెళ్లిపోవే ‘ సూపర్ హిట్ అయ్యింది. 2012లో ఈ సాంగ్ తెగ మారుమోగింది. ఈ పాట తనీష్, నితీ టేలర్ బ్రేకప్ గురించి ఉంటుంది. అప్పట్లో నితీ టేలర్ కు తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది.
View this post on Instagram
ఈ సినిమా తర్వాత తెలుగు రెండు చిత్రాల్లో నటించింది. కానీ అవి హిట్ కాలేదు. దీంతో ఈ బ్యూటీకి తెలుగులో అవకాశాలు రాలేదు. కానీ ఆమెకు నార్త్ లో మాత్రం ఫాలోయింగ్ ఎక్కువే ఉంది. బుల్లితెరపై సీరియల్స్ చేసి అభిమానులకు దగ్గరయ్యింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో పుల్ యాక్టివ్ గా ఉంటుంది నితీ. ఓవైపు సీరియల్స్ చేస్తూనే.. ఆర్మీ ఆఫీసర్ పరీక్షిత్ బవాని పెళ్లి చేసుకుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.