Tollywood: ఈ ఫోటోలో ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ ఉన్నారు.. ఆ హీరోల సినిమాలకు థియేటర్లు దద్దరిల్లాల్సిందే.. ఎవరో గుర్తుపట్టండి ..
ఇద్దరు పాన్ ఇండియా సూపర్ స్టార్స్. వారిద్దరి సినిమాల కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక ఈస్టార్స్ మూవీస్ రిలీజ్ అయితే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా వీరికి భారీగా అభిమానులున్నారు. ఎవరో గుర్తుపట్టండి.

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో త్రోబ్యాక్ ఫోటోస్ వైరలవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా స్టార్స్ చిన్ననాటి ఫోటోస్ తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ క్రేజీ స్టార్స్ బాల్యం ఫోటో నెట్టింట వైరలవుతుంది. పైన ఫోటోను చూశారు కదా. అందులో మొత్తం ముగ్గురు స్టార్ హీరోస్ ఉన్నారు. ఇద్దరు పాన్ ఇండియా సూపర్ స్టార్స్. వారిద్దరి సినిమాల కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక ఈస్టార్స్ మూవీస్ రిలీజ్ అయితే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా వీరికి భారీగా అభిమానులున్నారు. ఎవరో గుర్తుపట్టండి.
ఆ ఫోటోలో ఉన్న హీరోస్.. మెగా ఫ్యామిలీకి చెందినవారే. వారు మరెవరో కాదు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. అల్లు శిరీష్. బన్నీ పుట్టినరోజు సందర్భంగా తీసిన ఫోటో అని తెలుస్తుంది. అందులో చెర్రీకి ప్రేమగా కేక్ తినిపిస్తున్నారు బన్నీ. ఇక ఆ పక్కనే అల్లు శిరీష్ ఉండగా.. మెగా డాటర్ సుష్మిత కొణిదెల కూడా ఉన్నారు. ప్రస్తుతం బన్నీ.. చరణ్ చిన్ననాటి ఫోటో నెట్టింట వైరలవుతుండగా.. ఫ్యాన్స్ ఎగ్జయిట్ అవుతున్నారు.




ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. ఇక మరోవైపు చరణ్.. పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఆర్సీ 15 వర్కింగ్ టైటిల్ తో రాబోతున్న ఈ మూవీలో చరణ్ పొలిటికల్ లీడర్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక వీరిద్దరి సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.




