Pushpa2: మంచు కొండల్లో పుష్ప 2 హుక్ స్టెప్ వేసిన సీనియర్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా? ఈ వీడియో చూడండి
ఇటీవల పుష్పా పుష్పా అనే సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూట్ లో రికార్డులు కొల్లగొడుతోంది. సోషల్ మీడియాలోనూ ఈ సాంగ్ దే హవా. ఈ సాంగ్ లో బన్నీ వేసిన హుక్ స్టెప్ బాగా వైరల్ గా మారింది. షూస్ విప్పి కాలు మీద కాలు వేసుకుని చేసే స్టెప్ అందరినీ ఆకట్టుకుంంది. అందుకే చాలా మంది ఈ హుక్ స్టెప్ ను అనుకరిస్తూ ఇన్ స్టా, యూట్యూబ్ లో రీల్స్ చేసుకుంటున్నారు.

అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలోని పాటలు, డైలాగులు, స్టెప్పులు ఏ రేంజ్‌లో హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ‘అంతకు మించి’ అంటూ పుష్ప 2 వస్తోంది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ క్రేజీ సీక్వెల్ స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15న విడుదల కానుంది. దీంతో ఇప్పటి నుంచే ప్రమోషన్లు షురూ చేశారు చిత్ర బృందం. ఇందులో భాగంగా ఇటీవల పుష్పా పుష్పా అనే సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూట్ లో రికార్డులు కొల్లగొడుతోంది. సోషల్ మీడియాలోనూ ఈ సాంగ్ దే హవా. ఈ సాంగ్ లో బన్నీ వేసిన హుక్ స్టెప్ బాగా వైరల్ గా మారింది. షూస్ విప్పి కాలు మీద కాలు వేసుకుని చేసే స్టెప్ అందరినీ ఆకట్టుకుంంది. అందుకే చాలా మంది ఈ హుక్ స్టెప్ ను అనుకరిస్తూ ఇన్ స్టా, యూట్యూబ్ లో రీల్స్ చేసుకుంటున్నారు. సినిమా సెలబ్రిటీలు, సోషల్ మీడియా స్టార్స్ సైతం పుష్ప 2 హుక్ స్టెప్ ను వేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ కూడా అల్లు అర్జున్ పుష్ప 2 స్టెప్ వేశారు. అది కూడా ఏకంగా మంచు కొండల్లో. దీనికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా అది కాస్తా వైరల్ గా మారింది. మరి ఎంతో గ్రేస్ తో డ్యాన్స్ చేసిన ఈ సీనియర్ హీరోయిన్ ను గుర్తు పట్టారా? ఈ అందాల తార మరెవరో కాదు సీనియర్ నటి మీనా.
సినిమా షూటింగులతో బిజీబిజీగా ఉండే మీనా ఇటీవల యూరప్ లోని ఓ ఐస్‌లాండ్‌కు విహారయాత్రకు వెళ్లారు. తన వెకేషన్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడూ షేర్ చేస్తుంటుంది. అలా మంచు ద్వీపం నుండి పుష్ప 2 హుక్ స్టెప్ ను రీక్రియేట్ చేశారు మీనా. ఆ వీడియోను నెట్టింట షేర్ చేసుకోగా అది కాస్తా వైరల్ గా మారింది. దీనికి ‘డెడ్లీ కాంబినేషన్.. మంచు, అగ్ని కలయిక’ అని క్రేజీ క్యాప్షన్ కూడా ఇచ్చింది. అంటే మంచులో ఉండగా మీనా పుష్ప 2ను ఫైర్ తో పోలుస్తూ స్టెప్పులేసిందన్న మాట. ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోన్న మీనా డ్యాన్స్ వీడియోను మీరు కూడా చూసేయండి.
మీనా డ్యాన్స్ వీడియో ఇదిగో…
View this post on Instagram
మీనా లేటెస్ట్ ఫొటోలు..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.