Pakka Commercial: పక్కా కమర్షియల్ మూవీ నుంచి మరో సర్‌ప్రైజింగ్ అప్డేట్.. సరికొత్తగా ట్రైలర్ గ్లింప్స్..
సినిమా ప్రమోషన్స్ వేగం పెంచింది చిత్రయూనిట్. తాజాగా ఈ మూవీ ట్రైలర్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో మ్యాచో హీరో గోపిచంద్ (Gopichand) నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం పక్కా కమర్షియల్ (pakka commercial). ఈ సినిమాలో గోపిచంద్ సరసన రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మాత బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోస్ మరింత క్యూరియసిటీని పెంచగా.. ఇదివరకు విడుదలైన సాంగ్స్ కు ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన వస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా జూలై 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగం పెంచింది చిత్రయూనిట్. తాజాగా ఈ మూవీ ట్రైలర్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.
కోర్టు నేపథ్యంలో ఈ సినిమా ఉండనున్నట్లుగా తాజాగా విడుదలైన గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది. మీరు కేసు ఒప్పుకునే ముందు ఫీజు వద్దు రమ్మంటారు.. పనయ్యాక వాణ్ణి.. అంటూ కమెడియన్ శ్రీనివాస రెడ్డి చెప్పే డైలాగ్తో వీడియో ప్రారంభమయ్యింది. అయితే శ్రీనివాస రెడ్డి డైలాగ్ కంప్లీట్ కాకముందే వీడియో బఫర్ అవుతూ ఉంటుంది.. వెంటనే డైరెక్టర్ మారుతి వాయిస్ నుంచి ఓ నొక్కేస్తున్నారు.. అది బఫర్ కావట్లేదు.. మేమే అలా చేశాం.. ట్రైలర్ వచ్చాక ఆశ్చర్యపోవాల్సిందే అంటూ చెప్పుకోచ్చారు. 30 సెకన్ల నిడివి ఉన్న వీడియో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఇందులో రాశీఖన్నా, గోపిచంద్ లాయర్లుగా కనిపించనుండగా.. సత్యరాజ్, కీలకపాత్రలో నటించారు. ఈ సినిమాలో కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి జకేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు.