NTR 30: సెట్స్‌లో అడుగుపెట్టిన యంగ్ టైగర్.. వీడియో రిలీజ్ చేసి సర్పైజ్ ఇచ్చిన తారక్..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Apr 01, 2023 | 6:47 PM

తాజాగా అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు తారక్.. ఎన్టీఆర్ 30 సెట్స్ నుంచి ఓ క్రేజీ వీడియో రిలీజ్ చేశారు. దీంతో ఆ వీడియో క్షణాల్లోనే వైరలయ్యింది. ముఖ్యంగా అందులో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తోపాటు.. తారక్ వాయిస్ గూస్ బంప్స్ తెప్పిస్తుందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

NTR 30: సెట్స్‌లో అడుగుపెట్టిన యంగ్ టైగర్.. వీడియో రిలీజ్ చేసి సర్పైజ్ ఇచ్చిన తారక్..
Ntr 30
Follow us

ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచస్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. గ్లోబల్ స్టార్‏గా ఫాలోయింగ్ పెంచుకున్న తారక్.. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ షూరు అయ్యింది. #NTR 30 అనే వర్కింగ్ టైటిల్‏తో తెరకెక్కుతున్న ఈ మూవీలో తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. అయితే పూజా కార్యక్రమాల తర్వాత సైలెంట్ అయ్యారు మేకర్స్. ఈ క్రమంలో తాజాగా అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు తారక్.. ఎన్టీఆర్ 30 సెట్స్ నుంచి ఓ క్రేజీ వీడియో రిలీజ్ చేశారు. దీంతో ఆ వీడియో క్షణాల్లోనే వైరలయ్యింది. ముఖ్యంగా అందులో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తోపాటు.. తారక్ వాయిస్ గూస్ బంప్స్ తెప్పిస్తుందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

#NTR30 సెట్‏లో తారక్ ఎంటర్ కాగా.. డైరెక్టర్ కొరటాల శివ దగ్గరుండి మరీ రిసీవ్ చేసుకున్నారు. అయితే మొత్తం లైట్స్ వెలుగులో తారక్ నడుస్తూ వెళ్తుండగా.. ఇందులో ఎన్టీఆర్ లుక్ కాస్త విభిన్నంగా ఉన్నట్లుగా వీడియో అర్థమవుతుంది. వస్తున్నా.. అంటూ తారక్ చెప్పడం వినొచ్చు. దీంతో ఈ సినిమాపై మరోసారి అంచనాలు పెరిగాయి. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నిషీయన్స్ పనిచేస్తున్న సంగతి తెలిసిందే.

కెన్నీ బెట్స్ స్టంట్ కొరియోగ్రాఫర్ గా.. బ్రాడ్ మిన్నిచ్ వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నారు. కళ్యాణ్ రామ్, కె.హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది జాన్వీ.

ఇవి కూడా చదవండి

View this post on Instagram

A post shared by Jr NTR (@jrntr)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Click on your DTH Provider to Add TV9 Telugu