AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ స్టార్ హీరో పక్కన నేను, సుధీర్ నటిచాల్సింది.. కానీ మిస్ అయ్యింది

ప్రేక్షకులను ఆకట్టుకున్న టీవీ షోలు చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకునే షో పేరు జబర్దస్త్. సినిమాలకు మించి ఈ టీవీ షో పాపులర్ అయ్యింది. కామెడీ స్కిట్స్ ప్రేక్షకులను తెగ నవ్వించాయి. ఇక జబర్దస్త్ ద్వారా చాలా మంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. కొంతమంది హీరోలుగా సినిమాలు చేస్తున్నారు.

ఆ స్టార్ హీరో పక్కన నేను, సుధీర్ నటిచాల్సింది.. కానీ మిస్ అయ్యింది
Getup Srinu, Sudheer
Rajeev Rayala
|

Updated on: Apr 08, 2026 | 6:23 PM

Share

జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన నటుల్లో గెటప్ శ్రీను ఒకరు. తన కామెడీతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నాడు. సినిమాల్లోనూ నటిస్తూ మెప్పిస్తున్నాడు. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో తన కామెడీతో నవ్వులు పూయిస్తూ అందరిని ఆకట్టుకుంటున్నాడు గెటప్ శ్రీను. ఇటీవలే రాకాస సినిమాతో మరో హిట్ అందుకున్నాడు శ్రీను. తాజాగా ఓ ఇంటర్వ్యూలో గెటప్ శీను తన కెరీర్‌లోని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాను మొదట సినిమాల వైపు మొగ్గు చూపినా, వయసు తక్కువగా ఉండటం వల్ల అవకాశాలు రాలేదన్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వెనక్కి వెళ్లిన తర్వాత, మల్లెమాల సంస్థ తనకు రెండవ జీవితాన్ని ఇచ్చిందని తెలిపాడు శ్రీను. జబర్దస్త్ షో ద్వారా వచ్చిన విశేష ప్రజాదరణ దేశవ్యాప్తంగా తనను గుర్తించేలా చేసిందని తెలిపాడు. అయితే, టీవీలో బిజీగా ఉండటం వల్ల సినిమా అవకాశాలు కోల్పోవాల్సి వచ్చిందని శీను వెల్లడించాడు.

నాకు బ్రేకప్ అయ్యింది.. మా అమ్మకు కూడా అది తెలుసు.. షాకింగ్ విషయం చెప్పిన కృతిశెట్టి

అలాగే ఆయన మాట్లాడుతూ.. నాన్నకు ప్రేమతో చిత్రంలో తానూ, సుధీర్ చేయాల్సిన ఒక పాత్రను మిస్ చేసుకున్నానని, ఆ పాత్రను రమేష్, ఠాగూర్ రమేష్, నవీన్ పోషించారని ఆయన గుర్తు చేసుకున్నాడు గెటప్ శ్రీను. టీవీ స్టార్‌డమ్ సినిమా పాత్రలకు కొంత ఆటంకం కలిగించినప్పటికీ, మల్లెమాల పట్ల తనకు అంతులేని కృతజ్ఞత ఉందని, ఆ సంస్థ తనకు జీవితాన్ని, గుర్తింపును ఇచ్చిందని గెటప్ శీను స్పష్టం చేశాడు.

వార్ని..! ఈ నటుడి భార్య ఈమేనా..!! తెలుగులో చాలా పాపులర్ నటి కదా గురూ..!!

గెటప్ శ్రీను మాట్లాడుతూ.. జబర్దస్త్ షో ద్వారా తనకు అనూహ్యమైన పాపులారిటీ వచ్చిందని, అరకు, పాడేరు వంటి మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రజలు తనను గుర్తుపట్టడం ఆనందం కలిగించిందని ఆయన అన్నాడు. అయితే, టీవీలో నిరంతరం బిజీగా ఉండటం వల్ల సినిమా అవకాశాలు కోల్పోవాల్సి వచ్చిందని గెటప్ శీను అన్నాడు. దర్శకులు తన టీవీ షెడ్యూల్ కారణంగా డేట్లు సర్దుబాటు చేయలేరని భావించి, సినిమా అవకాశాలను తగ్గించారని చెప్పారు. నాన్నకు ప్రేమతో చిత్రంలో తానూ, సుధీర్ చేయాల్సిన ఒక పాత్రను మిస్ చేసుకున్నానని, ఆ పాత్రను రమేష్, ఠాగూర్ రమేష్, నవీన్ పోషించారని ఆయన గుర్తు చేసుకున్నారు. కేవలం ఒకటి రెండు సీన్ల పాత్రలు చేయడం వల్ల సినిమాలో అంతగా గుర్తింపు రాదని, బ్రహ్మానందం వంటి ప్రముఖ హాస్యనటులు ఉన్నప్పుడు తమలాంటి వారికి ఎక్కువ మైలేజ్ రాదని శీను అభిప్రాయపడ్డారు. జబర్దస్త్ ద్వారా వచ్చిన వైల్డ్ ఇమేజ్ కారణంగా సినిమాల్లో ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడం కొంత కష్టంగా మారిందని, తన సన్నిహితులైన దర్శకులు కూడా మంచి పాత్రలు ఇవ్వడానికి ఆలోచిస్తున్నారని గెటప్ శీను చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

హీరో లేడు.. ఫైట్స్, స్పెషల్ సాంగ్స్ లేవు..! కట్ చేస్తే నాలుగేళ్లుగా ఓటీటీలో తిరుగులేని సినిమా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఒక్క జూన్‌లో వెంకన్నకు ఎన్ని కోట్ల ఆదాయమొచ్చిందో తెలుసా?
ఒక్క జూన్‌లో వెంకన్నకు ఎన్ని కోట్ల ఆదాయమొచ్చిందో తెలుసా?
ముందు జాగ్రత్తగా ట్యాబ్లెట్స్ బటానీల్లా తినేస్తున్నారా..?
ముందు జాగ్రత్తగా ట్యాబ్లెట్స్ బటానీల్లా తినేస్తున్నారా..?
పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. కేవలం 72 గంటల్లోనే డబ్బులు..
పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. కేవలం 72 గంటల్లోనే డబ్బులు..
హీరోయిన్ ఆర్తి అగర్వాల్ కెరీర్‌ను భ్రష్టు పట్టించింది అతనే
హీరోయిన్ ఆర్తి అగర్వాల్ కెరీర్‌ను భ్రష్టు పట్టించింది అతనే
వారానికి 150 నిమిషాల వ్యాయామం చేస్తే చాలు.. డాక్టర్ తో పనే లేదు
వారానికి 150 నిమిషాల వ్యాయామం చేస్తే చాలు.. డాక్టర్ తో పనే లేదు
సైలెంట్‌గా శ్రీలంకను ఉతికేస్తున్న సాయి సుదర్శన్, పడిక్కల్!
సైలెంట్‌గా శ్రీలంకను ఉతికేస్తున్న సాయి సుదర్శన్, పడిక్కల్!
భాగస్వామి ప్రవర్తనలో ఈ 5 మార్పులు కనిపిస్తే వెంటనే అలర్టవ్వండి
భాగస్వామి ప్రవర్తనలో ఈ 5 మార్పులు కనిపిస్తే వెంటనే అలర్టవ్వండి
కోరిక తీరితే గడియారం సమర్పించే అరుదైన శివాలయం ఎక్కడుందో తెలుసా?
కోరిక తీరితే గడియారం సమర్పించే అరుదైన శివాలయం ఎక్కడుందో తెలుసా?
మిగిలిపోయిన ఆహారాన్ని ఇలా నిల్వ చేస్తే.. ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం!
మిగిలిపోయిన ఆహారాన్ని ఇలా నిల్వ చేస్తే.. ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం!
రాత్రిళ్లు దీపం పురుగులతో విసుగెత్తారా? ఈ టిప్స్‌తో వాటికి చెక్
రాత్రిళ్లు దీపం పురుగులతో విసుగెత్తారా? ఈ టిప్స్‌తో వాటికి చెక్