Vakeel Saab And Gangu Bhai: వకీల్‌సాబ్‌తో వచ్చిన ‘లేడీ డాన్’.. భయపెట్టిస్తోన్న ముంబయి మాఫియా క్వీన్..
Gangu Bhai: మనం ఇప్పటి వరకు చూసిన మాఫియా చిత్రాల్లో మగవారే డాన్‌లుగా కనిపిస్తుంటారు. అయితే తొలిసారి లేడీ డాన్ ప్రధాన పాత్రలో ఓ సినిమా రానుంది. అదే గంగూబాయ్..
Gangu Bhai: మనం ఇప్పటి వరకు చూసిన మాఫియా చిత్రాల్లో మగవారే డాన్‌లుగా కనిపిస్తుంటారు. అయితే తొలిసారి లేడీ డాన్ ప్రధాన పాత్రలో ఓ సినిమా రానుంది. అదే గంగూబాయ్.. బాలీవుడ్ నటి అలియాభట్ హీరోయిన్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ముంబయి నగరానికి చెందిన మాఫియా క్వీన్ గంగూబాయ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘వకీల్ సాబ్’ చిత్రం ప్రదర్శితమవుతోన్న థియేటర్లలో గంగూబాయ్ తెలుగు వెర్షన్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇక టీజర్ విషయానికొస్తే.. అలియ తన అద్భుత నటతనో ఆకట్టుకుంది. టీజర్‌లో అలియా వేషధారణ, మాట్లాడుతోన్న తీరు, వేస్తోన్న పంచ్ డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటి వరకు బబ్లీ గర్ల్‌గా క్యూట్ క్యారెక్టర్లకు మాత్రమే పరిమితమైన అలియా.. మొదటిసారి పూర్తిగా మాస్ రోల్‌లో నటిస్తుండడం విశేషం. ముఖ్యంగా టీజర్‌లో వచ్చే ‘కామటిపురలో అమావాస్య రాత్రి కూడా అంధకారం ఉండదంటారు. ఎందుకంటే అక్కడ గంగూ ఉంటుంది. గంగూ చంద్రిక చంద్రుడిలానే ఉంటుంది. గౌరవంతో బతకాలి. ఎవ్వడికీ భయపడకూడదు. పోలీసుకైనా, మంత్రికైనా, ఎమ్మెల్యేకైనా..’ అని చెప్పే డైలాగ్‌లు టీజర్‌కు హైలెట్‌గా నిలిచాయి. జులై 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా అలియాకు ఎలాంటి ఇమేజ్ తెచ్చిపెడుతుందో చూడాలి. ఇక ఈ సినిమాను హిందీ, తెలుగుతో పాటు పలు భారతీయ భాషల్లో విడుదల చేయనున్నారు. Also Read: RGV New Movie: ‘పట్టపగలు’ను… ‘దెయ్యం’గా మార్చిన రామ్ గోపాల్ వర్మ.. ఈసారైనా భయపెడతాడా..?
Vakeel Saab Movie Review: ప్రభంజనం సృష్టిస్తున్న పవర్ స్టార్ ‘వకీల్ సాబ్’.. బ్లాక్ బస్టర్ దిశగా..
Heroine Anjali: హీరోయిన్ అంజలికి కరోనా.? క్లారిటీ ఇచ్చిన ‘వకీల్ సాబ్’ నటి.!