Heroine Anjali: హీరోయిన్ అంజలికి కరోనా.? క్లారిటీ ఇచ్చిన ‘వకీల్ సాబ్’ నటి.!
Anjali Covid 19 Positive: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ వైరస్ సినీ ఇండస్ట్రీని సైతం వదలిపెట్టడం లేదు. ఇప్పటికే దర్శకుడు త్రివిక్రమ్..
Anjali Covid 19 Positive: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ వైరస్ సినీ ఇండస్ట్రీని సైతం వదలిపెట్టడం లేదు. ఇప్పటికే దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత అల్లు అరవింద్, విజేయంద్రప్రసాద్, నివేదా థామస్ సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ జాబితాలోకి హీరోయిన్ అంజలి సైతం చేరిందని.. ఆమెకు కరోనా వచ్చినట్లుగా పలు సామాజిక మాధ్యమాల్లో వార్తలు హల్చల్ చేశాయి. ప్రస్తుతం ఆమె హోం క్వారంటైన్‌లో చికిత్స తీసుకున్తున్నట్లుగా రూమర్స్ పుట్టుకొచ్చాయి. తాజాగా వీటిపై స్వయంగా హీరోయిన్ అంజలి సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు.
” గత కొద్దిరోజులుగా నాకు కోవిడ్ సోకిందంటూ పలు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. అవన్నీ వట్టి రూమర్స్ మాత్రమే. ఏమాత్రం నిజం లేదు. నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. నాకు కరోనా సోకలేదు. మీరందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నా” అని ట్వీట్ ద్వారా అంజలి పేర్కొంది.
— Anjali (@yoursanjali) April 8, 2021
Also Read:
‘జగనన్న స్మార్ట్ టౌన్’.. దరఖాస్తు చేసుకోండిలా.. అర్హతలు ఇవే.!
ఈ ఫోటోలోని ఇద్దరు హీరోయిన్స్‌ను గుర్తు పట్టారా.? సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పిక్.!
ఇంటి గుమ్మంలో తిష్టవేసిన సింహాలు.. డోర్ తీసి కంగుతిన్న యజమాని.. కట్ చేస్తే ఊహించని సంఘటన.!