AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RGV New Movie: ‘పట్టపగలు’ను… ‘దెయ్యం’గా మార్చిన రామ్‌ గోపాల్‌ వర్మ.. ఈసారైనా భయపెడతాడా..?

RGV New Movie: సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉంటారు దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ. కాంట్రవర్సీ సబ్జెక్ట్‌తో నిత్యం వార్తల్లో నిలిచే వర్మ.. ఉచితంగా పబ్లిసిటీని పొందుతుంటారు. ఇక ట్విట్టర్‌ వేదికగా వరుస...

RGV New Movie: 'పట్టపగలు'ను... 'దెయ్యం'గా మార్చిన రామ్‌ గోపాల్‌ వర్మ.. ఈసారైనా భయపెడతాడా..?
Rgv Deyyam
Narender Vaitla
|

Updated on: Apr 09, 2021 | 11:42 AM

Share

RGV New Movie: సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉంటారు దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ. కాంట్రవర్సీ సబ్జెక్ట్‌తో నిత్యం వార్తల్లో నిలిచే వర్మ.. ఉచితంగా పబ్లిసిటీని పొందుతుంటారు. ఇక ట్విట్టర్‌ వేదికగా వరుస పెట్టి సినిమాలను ప్రకటించే వర్మ అందులో కొన్నింటిని మాత్రమే పట్టాలెక్కిస్తుంటారు. మిగతావన్నీ కేవలం ప్రకటనలకే పరిమితమవుతాయి. ఇలా ఇప్పటి వరకు అలాంటి చాలా సినిమాలు కేవలం ట్విట్టర్‌లో పోస్ట్‌ల రూపంలోనే మిగిలిపోయాయి. ఇక వర్మ తెరకెక్కించిన సినిమాల్లో కూడా కొన్ని షూటింగ్‌ జరుపుకొని విడుదలకానివి ఉన్నాయి. అలాంటి వాటిలో రాజశేఖర్‌ హీరోగా నటించిన ‘పట్ట పగలు’ ఒకటి. ఈ సినిమా 2014లో షూటింగ్‌ జరుపుకుంది. అప్పట్లోనే ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. అయితే సినిమా మాత్రం విడుదలకు నోచుకోలేదు. ఈ విషయమై పలు ఇంటర్వ్యూలో వర్మను ప్రశ్నించగా.. సమాధానాన్ని దాటవేసే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఇదే సినిమాను ‘దెయ్యం’ పేరుతో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ నెల 16న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే వర్మ పుట్టిన రోజు సందర్భంగా సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. అయితే ఇదే ట్రైలర్‌ను 2014లో వర్మ విడుదల చేయడం గమనార్హం. ఇప్పుడు దాంట్లోనే కొన్ని చిన్న చిన్న మార్పులు చేసి మళ్లీ విడుదల చేసినట్లు అర్థమవుతోంది. గతంలో కూడా ట్రైలర్‌ను విడుదల చేసిన వర్మ సినిమాను మాత్రం రిలీజ్‌ చేయలేదు.. మరి ఈసారైనా వర్మ ప్రేక్షకులను భయపెడతాడా లేదా చూడాలి.

Also Read: Vakeel Saab Movie Review: ప్రభంజనం సృష్టిస్తున్న పవర్ స్టార్ ‘వకీల్ సాబ్’.. బ్లాక్ బస్టర్ దిశగా..

Vakeel Saab: దిల్‌రాజు నమ్మకం ఒమ్ము కాలేదు.. ఫలించిన టాప్‌ ప్రొడ్యూసర్‌ డ్రీమ్‌.. ఖుషీ ఖుషీగా..

Rajinikanth: ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ బయలు దేరిన రజనీకాంత్‌.. ఎందుకో తెలుసా..?