Uppena collections : కలెక్షన్స్‌‌‌‌‌లోను ‘ఉప్పెన’లా ఎగసి పడుతున్న మెగాహీరో డెబ్యూ మూవీ.. వారం రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే..

ఉప్పెన సినిమాతో సక్సెస్ ఫుల్ ఎంట్రీ ఇచ్చాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో బెంగుళూరు

Uppena collections : కలెక్షన్స్‌‌‌‌‌లోను 'ఉప్పెన'లా ఎగసి పడుతున్న మెగాహీరో డెబ్యూ మూవీ.. వారం రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే..
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 19, 2021 | 1:50 PM

Uppena movie : ఉప్పెన సినిమాతో సక్సెస్ ఫుల్ ఎంట్రీ ఇచ్చాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో బెంగుళూరు భామ కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఇక అందమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ – సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మించాయి విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించిన ఈ సినిమా పై మొదటి నుంచి మంచి బజ్ క్రియేట్ అయ్యింది. దేవీశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం అలరించింది. దాంతో ఈ సినిమా విడుదలైన దగ్గరనుంచి హిట్ టాక్ తో దూసుకుపోతుంది.

ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో అత్యధిక షేర్ వసూలు చేసిన డెబ్యూ హీరోగా వైష్ణవ్ తేజ్ రికార్డ్ క్రియేట్ చేసాడు వైష్ణవ్ తేజ్. ఇక ఉప్పెన సినిమా కలెక్షన్స్ కూడా ఉప్పెనలా ఎగిసి పడుతున్నాయి. సినిమా విడుదలైన వారం రోజుల్లోనే దాదాపు 38 కోట్లు కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఫస్ట్ వీక్ లో నైజాం ఏరియాలో 11.55 కోట్లు – సీడెడ్ లో 5.60 కోట్లు కలుపుకుని తెలుగు రాష్ట్రాల్లో 34.91 కోట్ల షేర్ వసూలు చేసింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా 37.91 కోట్ల షేర్ సొంతం చేసుకుంది. మరికొద్ది రోజుల్లోనే ఈసినిమా 50కోట్లు షేర్ వాసులు చేస్తుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Mosagallu Movie: ‘పైసా మే హి పరమాత్మ హై… దేవుడైనా హుండీ ముందే’.. ఆకట్టుకుంటోన్న మోసగాళ్లు సాంగ్‌..