Mosagallu Movie: ‘పైసా మే హి పరమాత్మ హై… దేవుడైనా హుండీ ముందే’.. ఆకట్టుకుంటోన్న మోసగాళ్లు సాంగ్‌..

One More Lyrical Song From Mosagallu movie: మంచు విష్ణు హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం 'మోసగాళ్లు'. అంతర్జాతీయ దర్శకుడు జెఫ్రీ గీ చిన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండడం..

Mosagallu Movie: 'పైసా మే హి పరమాత్మ హై... దేవుడైనా హుండీ ముందే'.. ఆకట్టుకుంటోన్న మోసగాళ్లు సాంగ్‌..
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 19, 2021 | 1:39 PM

One More Lyrical Song From Mosagallu movie: మంచు విష్ణు హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘మోసగాళ్లు’. అంతర్జాతీయ దర్శకుడు జెఫ్రీ గీ చిన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండడం, తెలుగుతోపాటు దాదాపు అన్ని భారతీయ భాషల్లో ఈ సినిమా విడుదల అవుతుండడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కథ మొత్తం డబ్బుల చుట్టే తిరుగుతున్నట్లు అర్థమవుతోంది. ఇది వరకు చిత్రయూనిట్‌ విడుదల చేసిన ‘డబ్బులు సంపాదించాలంటే’, ‘డబ్బే మనది కుమ్మేస్కో’ అనే పాటలు ఈ విషయాన్ని చెప్పకనే చెప్పాయి. ఇదిలా ఉంటే తాజాగా విడుదల చేసిన మరో లిరికల్‌ వీడియో కూడా ఈ సినిమా డబ్బు ప్రధాన కథాంశంగా రానుందని స్పష్టం చేస్తోంది. ‘పైసా మే హి పరమాత్మ హై.. దేవుడైనా హుండీ ముందే’ అనే సాగుతోన్న ఈ పాట ఆకట్టుకుంటోంది. ఇలా సినిమాలోని ప్రతీ పాట డబ్బు అనే అంశానికి ముడిపడి ఉండడం సినిమా కథపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో విష్ణు, కాజల్‌ అన్నాచెల్లెలుగా కనిపించనున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి ఈ సినిమాలో పోలీస్‌ పాత్రలో కనిపించనున్నాడు.

Also Read: Kapatadhaari Movie Review : ఆద్యంతం ఆసక్తిగా అలరించిన ‘కపటదారి’.. క్రైమ్ థ్రిల్లర్‌‌‌‌‌‌తో మరో హిట్ కొట్టిన సుమంత్