God Father: గాడ్ ఫాదర్ సినిమాకు ప్లస్.. మైనస్.. చిరు పాత్రపై పరుచూరి ఆసక్తికర కామెంట్స్..
తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యేలా చిన్న చిన్న మార్పులు చేసినప్పటికీ యథాతథంగా లూసీఫర్ కథనే గాడ్ ఫాదర్ చిత్రంగా తెరకెక్కించారు. చెల్లెళ్లకు దూరంగా ఉన్న అన్నయ్య వాళ్ల ప్రేమను ఎలా పొందాడు అనే అంశాన్ని
![God Father: గాడ్ ఫాదర్ సినిమాకు ప్లస్.. మైనస్.. చిరు పాత్రపై పరుచూరి ఆసక్తికర కామెంట్స్..](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/11/god-father-paruchuri.jpg?w=1280)
గాడ్ ఫాదర్ సినిమాతో చాలా కాలం తర్వాత సూపర్ హిట్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. మలయాళీ చిత్రం లూసీఫర్ రీమేక్‌గా వచ్చిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు మాత్రం రాబట్టలేకపోయింది. ఇందులో సత్యదేవ్, లేడీ సూపర్ స్టార్ నయనతార, సల్మాన్ ఖాన్ కీలకపాత్రలు పోషించారు. రాజకీయ నేపథ్యంలో సాగిన ఈ సినిమాపై సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. లూసీఫర్ రీమేక్ గా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీలో తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని చేసిన కొన్ని మార్పులు బాగున్నాయని అన్నారు. అలాగే చిరు బాడీ లాంగ్వేజ్ కు ఇలాంటి స్లో పేస్ కథలు సెట్ కావని తెలిపారు.
” తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యేలా చిన్న చిన్న మార్పులు చేసినప్పటికీ యథాతథంగా లూసీఫర్ కథనే గాడ్ ఫాదర్ చిత్రంగా తెరకెక్కించారు. చెల్లెళ్లకు దూరంగా ఉన్న అన్నయ్య వాళ్ల ప్రేమను ఎలా పొందాడు అనే అంశాన్ని చూపించారు. సమయానుగుణంగా ట్విస్టులను రివీల్ చేస్తూ కథలోకి తీసుకెళ్లారు డైరెక్టర్. ఆయన స్క్రీన్ ప్లేతో ఆడుకున్నారు. మాతృకతో పోలిస్తే తెలుగులో మంచి స్క్రీన్ ప్లే ఉంది. కానీ కథ, కథనం, డైలాగ్స్ పరంగా కాకుండా కేవలం చిరంజీవి బాడీ లాంగ్వేజ్ ను దృష్టిలో పెట్టుకుని కొన్ని విషయాలు వేరేలా ఉంటే మరింత బాగుండేది అనేది నా భావన.. ఈ సినిమాలో మరికొన్ని మార్పులు చేస్తే మరింత బాగుండేది. మెగాస్టార్ చిరంజీవి బాడీ లాంగ్వేజ్‌కు ఈ స్లో పేస్ స్టోరీ నప్పలేదు.
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/11/salman-khan-1.jpg)
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/11/vikram-gokhale-1.jpg)
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/11/rana-miheeka.jpg)
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/11/rajamouli.jpg)
అలాగే ఇది చిరుకు సరిపడే పాత్ర కానప్పటికీ.. దర్శకుడు చాలా వరకు విజయం సాధించాడు. చిరు పాత్రకు డ్యాన్సులు లేకుండా ఉండడం కాస్త ఇబ్బందిగా అనిపించింది. షఫీ చేసిన పాత్రను సునీల్ చేసి ఉంటే మరింత బాగుండేది. ముఖ్యంగా సల్మాన్ ఈ సినిమాకు ప్లస్.. మైనస్ కూడా అతడే. గాడ్ ఫాదర్ కు నమ్మిన బంటులా కనిపించిన సల్మాన్ రౌడీలతో పోరాటాలు చేస్తూ స్క్రీన్ పై అదరగొట్టేశాడు. అయితే అలా చిరు ఉండగా.. సల్మాన్ ఫైట్ సీక్వెన్స్ లు చేయడం అభిమానులకు అంతగా నప్పదు. సల్మాన్ పోషించిన పాత్రలో రామ్ చరణ్, పవన్ ఉంటే ఆ వ్యత్సాసం తెలిసేది కాదు. ఇక డైలాగ్స్ మరింత పవర్ ఫుల్ గా ఉంటే చప్పట్లు పడేవి” అంటూ చెప్పుకొచ్చారు పరుచూరి.