Roja: హీరోయిన్ రోజా, హిందీ చిత్రంలో నటించారని మీకు తెలుసా.? ఇంతకీ ఆ సినిమా ఏంటంటే..
Narender Vaitla |
Updated on: Nov 26, 2022 | 6:52 PM
తనదైన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన నటి రోజా బాలీవుడ్‌లో ఓ సినిమాలో నటించారన్న విషయం మీలో ఎంత మందికి తెలుసు.? చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో...
Nov 26, 2022 | 6:52 PM
తెలుగు ప్రేక్షకులకు రోజా పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న రోజా సౌత్‌లో టాప్ హీరోయిన్స్‌గా ఎదిగారు. అయితే రోజా హిందీలో నటించందనే విషయం మీకు తెలుసా.?
1 / 5
సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్స్‌ల్లో ఒకరిగా ఎదిగిన రోజా హిందీలో ఓ సినిమాలో నటించందనే విషయం చాలా మందికి తెలియదు. చిరంజీవిగా హీరోగా తెరకెక్కిన 'ది జెంటిల్ మెన్' సినిమా ద్వారా రోజా బాలీవుడ్ ప్రేక్షకులకు పలకరించింది.
2 / 5
అయితే ఈ సినిమాలో రోజా లీడ్ రోల్‌లో కాకుండా స్పెషల్ సాంగ్‌లో చిరంజీవి సరసన ఆడిపాడింది. ఈ చిత్రానికి మహేష్ భట్ దర్శకత్వం వహించారు.
3 / 5
తమిళంలో శంకర్ దర్శకత్వం వహించిన జెంటిల్ మెన్ చిత్రాన్ని హిందీలో 'ది జెంటిల్ మెన్' పేరుతో రీమేక్ చేశారు. రోజా నటించిన మొదటి, చివరి హిందీ చిత్రం ఇదే కావడం గమనార్హం.
4 / 5
ఇదిలా ఉంటే రాజకీయాల్లోని వచ్చి తర్వాత కూడా పలు రియాలిటీ షోలలో కనిపించిన రోజా.. మంత్రిగా బాధ్యతలు స్వీకరణించిన తర్వాత సినీ ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.