Vijay Thalapathy: దళపతి విజయ్ కోసం అభిమాని చేసిన అద్భుతం.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..
డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో త్రిష కథానాయికగా నటిస్తుంది. ఇక ఇటీవల విజయ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ మూవీపై అంచనాలను ఓరెంజ్ లో పెంచేసింది. ఇదిలా ఉంటే.. తాజాగా విజయ్ అభిమాని తన ఫేవరెట్ హీరో కోసం అద్భుతమైన వీడియో చేశాడు. విజయ్ అన్న నీకోసమే చేశానంటూ ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది.

కోలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టాప్ హీరో విజయ్ దళపతి. ఆయన కోసం ప్రాణాలిచ్చే అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి లేదు. బాలనటుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన విజయ్.. ఆ తర్వాత స్టార్ హీరోగా ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. ఈ ఏడాది వారసుడు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈహీరో.. ఇప్పుడు లియో సినిమాలో నటిస్తున్నారు. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో త్రిష కథానాయికగా నటిస్తుంది. ఇక ఇటీవల విజయ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ మూవీపై అంచనాలను ఓరెంజ్ లో పెంచేసింది. ఇదిలా ఉంటే.. తాజాగా విజయ్ అభిమాని తన ఫేవరెట్ హీరో కోసం అద్భుతమైన వీడియో చేశాడు. విజయ్ అన్న నీకోసమే చేశానంటూ ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది.
ఇటీవల విజయ్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ తోపాటు.. టీజర్ కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అందులో ఫుల్ మాస్ లుక్ లో కనిపించారు విజయ్. అయితే ఈ సినిమా నుంచి మరో టీజర్ ను క్రియేట్ చేశాడు ఓ ఫ్యాన్. అది కూడా 3డీలో. దాదాపు 3 నిమిషాల 30 సెకన్ల నిడివి ఉన్న ఆ ట్రైలర్ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. యానిమేషన్ టెక్నాలజీతోపాటు.. త్రీడి ఎఫెక్ట్స్ తో సినిమా లెవల్ కు ఏమాత్రం తగ్గకుండా ఉందంటూ.. సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.




ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుండడంతో ఫ్యాన్స్ విభిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను అక్టోబర్ 19న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
LEO 3D Animated Video.
Dear @actorvijay anna, this is for you🥰
#HBDThalapathyVIJAY #Leo @actorvijay@Jagadishbliss @7screenstudio@RamVJ2412 @GuRuThalaiva @OTFC_Off @VijayFansTrends pic.twitter.com/SzY1fUmdIg
— Maddy Madhav (@MaddyMadhav_) June 21, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




