Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RGV Vyuham: ఆర్జీవీ ఆఫీస్‌ ఎదుట ఉద్రిక్తత..’వ్యూహం’ సినిమా పోస్టర్లు దగ్ధం.. వర్మ రియాక్షన్ ఏంటంటే?

నిజానికి ఆర్జీవీ వ్యూహం మూవీపై సెన్సార్‌ కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కొన్ని సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బెంగళూరులోని రివైజ్ కమిటీకి సిఫార్సు చేసింది. బెంగళూరులో వ్యూహాం మూవీకి క్లీన్ యూ సర్టిఫికెట్‌ ఇచ్చారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని ఆర్జీవీ ఆఫీస్‌ ఎదుట ఆందోళన జరిగింది. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ మూవీ సమయంలోనే ఆర్జీవీకి తగినశాస్తి జరగాల్సిందని మండిపడ్డారు ఆందోళనకారులు

RGV Vyuham: ఆర్జీవీ ఆఫీస్‌ ఎదుట ఉద్రిక్తత..'వ్యూహం' సినిమా పోస్టర్లు దగ్ధం.. వర్మ రియాక్షన్ ఏంటంటే?
Ram Gopal Varma Vyuham, sapatham Movies
Follow us
Basha Shek

|

Updated on: Dec 25, 2023 | 8:34 PM

హైదరాబాద్‌లో డైరెక్టర్ ఆర్జీవీ ఆఫీస్ ఎదుట టెన్షన్ పరిస్థితి నెలకొంది. ‘వ్యూహం’ సినిమాకు వ్యతిరేకంగా కొంతమంది ఆందోళనకు దిగారు. వ్యూహం మూవీ పోస్టర్లను తగలబెట్టారు. సినిమా బ్యాన్ చేయాలని నినదించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్‌కి అనుకూలంగా నినాదాలు చేశారు ఆందోళన కారులు. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని ఆందోళనకారుల్ని చెదరగొట్టారు. నిజానికి ఆర్జీవీ వ్యూహం మూవీపై సెన్సార్‌ కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కొన్ని సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బెంగళూరులోని రివైజ్ కమిటీకి సిఫార్సు చేసింది. బెంగళూరులో వ్యూహాం మూవీకి క్లీన్ యూ సర్టిఫికెట్‌ ఇచ్చారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని ఆర్జీవీ ఆఫీస్‌ ఎదుట ఆందోళన జరిగింది. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ మూవీ సమయంలోనే ఆర్జీవీకి తగినశాస్తి జరగాల్సిందని మండిపడ్డారు ఆందోళనకారులు. చంద్రబాబు ఫ్యామిలీ టార్గెట్‌గా ఆర్జీవీ సినిమాలు తీస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమా విడుదలపై హైదరాబాద్‌ సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చిత్రాన్ని ఓటీటీ, ఆన్‌లైన్‌, ఇంటర్నెట్ వేదికల్లో ఎక్కడా విడుదల చేయొద్దని ఆదేశించింది. ఈ మేరకు రామదూత క్రియోషన్స్‌, దర్శకుడు రాంగోపాల్‌ వర్మకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 27కి వాయిదా వేసింది.

వ్యూహం సినిమాపై టీడీపీ నేతలు హైదరాబాద్‌ సిటీసివిల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ చిత్రానికి ఇచ్చిన సెన్సార్‌ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని కోరారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ప్రాంతీయ కార్యాలయం, రివైజింగ్ కమిటీ, రామదూత క్రియేషన్స్‌, నిర్మాత దాసరి కిరణ్‌ కుమార్, దర్శకుడు రాంగోపాల్‌ వర్మలను ప్రతివాదులుగా చేర్చారు. చిత్రం విడుదల కాకుండా నిర్మాతను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సినిమా వల్ల చంద్రబాబు ప్రాథమిక హక్కులకు భంగం కలగడంతో పాటు పార్టీ గౌరవం దెబ్బతింటోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు తన మూవీ పోస్టర్లు దగ్ధం చేయడంపై ఆర్జీవీ స్పందించారు.  చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ లను ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

స్పందించిన ఆర్జీవీ.. సటైరికల్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

BSNL VIP Number: బీఎస్‌ఎన్‌ఎల్‌లో వీఐపీ నంబర్‌ పొందడం ఎలా?
BSNL VIP Number: బీఎస్‌ఎన్‌ఎల్‌లో వీఐపీ నంబర్‌ పొందడం ఎలా?
స్టన్నింగ్ లుక్‌తో ఎలక్ట్రిక్ బుల్లెట్ బండి.. లాంచింగ్ ఎప్పుడంటే?
స్టన్నింగ్ లుక్‌తో ఎలక్ట్రిక్ బుల్లెట్ బండి.. లాంచింగ్ ఎప్పుడంటే?
కడప జైల్ మెడికల్ క్యాంపు వెనకాల... ఏం జరిగిందో తెలిస్తే..
కడప జైల్ మెడికల్ క్యాంపు వెనకాల... ఏం జరిగిందో తెలిస్తే..
హోటల్‌లో ఉద్యోగం.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్‌గా కోట్లాది ఆస్తులు
హోటల్‌లో ఉద్యోగం.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్‌గా కోట్లాది ఆస్తులు
తిరుమల డీఎస్పీ కోళ్ల పెంపకం.. కట్‌ చేస్తే.. వేటుకు రంగం సిద్ధం
తిరుమల డీఎస్పీ కోళ్ల పెంపకం.. కట్‌ చేస్తే.. వేటుకు రంగం సిద్ధం
అమ్మకాల్లో ఆపిల్ రికార్డులు.. ఆ ఒక్క మోడల్‌తోనే నమ్మలేని ఆదాయం
అమ్మకాల్లో ఆపిల్ రికార్డులు.. ఆ ఒక్క మోడల్‌తోనే నమ్మలేని ఆదాయం
తిన్న తర్వాత నడుస్తున్నారా.. ఈ ఒక్కటి తెలుసుకోండి
తిన్న తర్వాత నడుస్తున్నారా.. ఈ ఒక్కటి తెలుసుకోండి
విజయ్ కారును వెంబడించిన ఫ్యాన్స్..
విజయ్ కారును వెంబడించిన ఫ్యాన్స్..
జూలై 31 తర్వాత పన్ను రిటర్న్ దాఖలు చేస్తే రీఫండ్‌ లభించదా?
జూలై 31 తర్వాత పన్ను రిటర్న్ దాఖలు చేస్తే రీఫండ్‌ లభించదా?
వావ్..కివీ ఫ్రూట్స్‌తో ఇన్ని లాభాలా.?టెన్షన్‌ లేకుండా లాగించేయండి
వావ్..కివీ ఫ్రూట్స్‌తో ఇన్ని లాభాలా.?టెన్షన్‌ లేకుండా లాగించేయండి