Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు ఈ రోజు చాలా చాలా స్పెషల్.. ఎందుకో తెలుసా..?
వివిధ దేశాలలో ప్రభాస్ ఫ్యాన్స్ సంఖ్య పెరిగింది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఇక సాహో, రీసెంట్ గా వచ్చిన ఆదిపురుష్ సినిమాలతో మరోసారి తన సత్తా ఏంటో నిరూపించాడు.

ప్రభాస్.. ఇప్పుడు ఈ పేరు ప్రపంచమంతా మారుమ్రోగుతోంది. ఎక్కడ చూసిన ఆయన పేరే వినిపిస్తుంది. మొన్నటి వరకు టాలీవుడ్ కె పరిమితమైన ప్రభాస్ కేజ్ బాహుబలి సినిమాతో ప్రపంచమంతా తెలిసింది. వివిధ దేశాలలో ప్రభాస్ ఫ్యాన్స్ సంఖ్య పెరిగింది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఇక సాహో, రీసెంట్ గా వచ్చిన ఆదిపురుష్ సినిమాలతో మరోసారి తన సత్తా ఏంటో నిరూపించాడు. అయితే డార్లింగ్ ప్రభాస్ కు ఈ రోజు చాలా చాలా స్పెషల్ డే.. తన జీవితంలో ఇది మరిచిపోలేని రోజు. ఇదే రోజు తొలిసారి కెమెరా ముందుకు వచ్చారు ప్రభాస్. ఈ రోజుతో ఆయన సినీ కెరీర్ ప్రారంభం అయ్యి 21 ఏళ్ళు అవుతుంది. ప్రభాస్ నటించిన తొలి సినిమా ఈశ్వర్. జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమామంచి హిట్ గా నిలిచింది. ఈ మూవీలో ప్రభాస్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
ఈ మూవీ రిలీజ్ అయ్యింది 11 నవంబర్ 2002 అతిథి ఈ మూవీ షూటింగ్ మొదలైంది మాత్రం 28/6/2002 అంటే సరిగ్గా ఇదే రోజు. ఇదే రోజున ప్రభాస్ ఈశ్వర్ మూవీ పూజాకార్యక్రమాలు జరుపుకుంది. ఈశ్వర్ మూవీతొలి షాట్ కు కృష్ణం రాజు క్లాప్ కొట్టారు.
ఇక ఈ సినిమాలో ప్రభాస్ మాస్ యువకుడి పాత్రలో నటించి మెప్పించారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ కెరీర్ ఏ రేంజ్ లో దూసుకుపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్దనాన్న ఆశీర్వాదంతో సినీ కెరీర్ ను ప్రారంభించిన ప్రభాస్ కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒక్కడిగా ఎదిగారు. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించనున్నారు. త్వరలోనే సలార్ , ప్రాజెక్ట్ కే, రాయల్ , స్పిరిట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.Prabhas