AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kamal Haasan: కమల్‌- మణిరత్నం సినిమాలో ఆ స్టార్‌ హీరో, హీరోయిన్లు.. క్రేజీ కాంబోనే సెట్ చేశారుగా..

భారతీయ సినిమా ఇండస్ట్రీలోని ఇద్దరు దిగ్గజాలు మళ్లీ ఒక్కటవుతున్నారు. అప్పుడెప్పుడో 36 ఏళ్ల క్రితం ' నాయగన్ ' (తెలుగులో నాయకుడు) సినిమాతో యావత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని దక్షిణాది వైపు చూసేలా చేసిన దర్శక దిగ్గజం మణిరత్నం , లోక నాయకుడు కమల్ హాసన్ ఇప్పుడు మళ్లీ కొత్త సినిమా కోసం జతకట్టనున్నారు. కమల్ హాసన్ 234వ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ సినిమాలో ఇంకా చాలా మంది స్టార్‌ హీరో, హీరోయిన్లు నటించబోతున్నారు

Kamal Haasan: కమల్‌- మణిరత్నం సినిమాలో ఆ స్టార్‌ హీరో, హీరోయిన్లు.. క్రేజీ కాంబోనే సెట్ చేశారుగా..
Mani Ratnam, Kamal Haasan
Basha Shek
|

Updated on: Sep 15, 2023 | 1:27 PM

Share

భారతీయ సినిమా ఇండస్ట్రీలోని ఇద్దరు దిగ్గజాలు మళ్లీ ఒక్కటవుతున్నారు. అప్పుడెప్పుడో 36 ఏళ్ల క్రితం ‘ నాయగన్ ‘ (తెలుగులో నాయకుడు) సినిమాతో యావత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని దక్షిణాది వైపు చూసేలా చేసిన దర్శక దిగ్గజం మణిరత్నం , లోక నాయకుడు కమల్ హాసన్ ఇప్పుడు మళ్లీ కొత్త సినిమా కోసం జతకట్టనున్నారు. కమల్ హాసన్ 234వ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ సినిమాలో ఇంకా చాలా మంది స్టార్‌ హీరో, హీరోయిన్లు నటించబోతున్నారు. కమల్ హాసన్, మణిరత్నం కలిసి పనిచేస్తున్నట్లు గతంలో వెల్లడించారు, అయితే సినిమాలోని ఇతర తారల గురించి చిత్ర బృందం హింట్ ఇవ్వలేదు. అయితే అదే సినిమాకు పని చేయబోతున్న ఓ మేకప్ ఆర్టిస్ట్ మాత్రం గోప్యంగా ఉంచాల్సిన విషయాన్ని బయటపెట్టాడు. కమల్-మణిరత్నం సినిమాలో రంజిత్ అంబాడి ప్రసాద మేకప్‌ ఆర్టిస్టుగా పని చేయనున్నారు. దీనికి సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో సినిమా ప్రకటన ప్రోమోను పంచుకున్నారు. ఈ పోస్టుకు నటులు దుల్కర్ సల్మాన్, జయం రవి , నటి త్రిష కృష్ణన్‌లను ట్యాగ్ చేశారు. కమల్ హాసన్, మణిరత్నం, ఏఆర్ రెహమాన్‌లను కూడా ట్యాగ్ చేశారు. దీంతో దుల్కర్, జయం రవి, త్రిష కూడా ఈ సినిమాలో నటించనున్నారని ఖరారు చేశారు. అయితే ఈ సినిమాలో కమల్ హాసన్ మినహా మరే ఇతర నటీనటుల గురించి మణిరత్నం కానీ, టీమ్ కానీ అధికారికంగా ప్రకటించలేదు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు. అయితే ఇప్పుడు రంజిత్ అంబాడి పోస్ట్ కారణంగా ఈ విషయం బయటపడింది.

దుల్కర్ సల్మాన్, జయం రవి, త్రిష కృష్ణన్‌లకు రెండోసారి మణిరత్నం సినిమాలో నటించే అవకాశం వచ్చింది. గతంలో మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియిన్ సెల్వన్’లో జయం రవి, త్రిష కృష్ణన్‌లు నటించారు. మణిరత్నం దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ ‘ఓకే కన్మణి’ అనే ప్రేమ చిత్రంలో నటించారు. ఇప్పుడు ఈ ముగ్గురు మళ్లీ మణిరత్నం సినిమాలో నటించనున్నారు. కాగా 36 ఏళ్ల తర్వాత కమల్ హాసన్, మణిరత్నం కలిసి నటిస్తున్నారు. కమల్ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో 1987లో విడుదలైన చిత్రం ‘నాయగన్’. తెలుగు సినిమా ఇండస్ట్రీలో గాడ్‌ఫాదర్‌ లాంటి సినిమాలకు నాయకుడే స్ఫూర్తి. ఇప్పుడు ఈ కాంబినేషన్‌ మళ్లీ ఒక్కటవుతుండడంతో సినిమా కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

KH234 లో స్టార్ క్యాస్టింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..