సెలబ్రెటీలందరూ ఇష్టంగా తినే ఫుడ్ ఏంటో తెలుసా.? అస్సలు ఊహించలేరు
సినిమా సెలబ్రెటీలు చాలా మంది కాస్ట్లీ లైఫ్ ను లీడ్ చేస్తూ ఉంటారు. ఖరీదైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కాగా చాలా మంది చాలా సింపుల్ ఫుడ్ తింటూ ఉంటారు. రోడ్ సైడ్ ఫుడ్ తినడానికి ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు.
సెలబ్రిటీలు లైఫ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాస్ట్లీ కార్లు, ఖరీదైన బంగ్లా, బట్టలు అబ్బో వేరే లెవల్ లో ఉంటాయి అన్ని. అలాగే సెలబ్రెటీలు తిండి ఫుడ్ కూడా అంతే.. ఎక్కడబడితే అక్కడ తినరు. అయితే అందరు సెలబ్రెటీలు 5 స్టార్ హోటళ్లలో భోజనం చేస్తారని, సాధారణ ఆహారం తినరని చాలా మంది అనుకుంటారు. కానీ, అందరూ నిజంగా అలా ఉండరు. కొందరికి లోకల్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. చాలా మంది సింపుల్ ఫుడ్ ను ఇష్టపడుతూ ఉంటారు. ఉదాహరణకు ప్రభాస్ కు పని పూరి అంటే ఇష్టమని చాలా సందర్భాల్లో చెప్పాడు. అలాగే ఇప్పుడు కొంతమంది సెలబ్రెటీలు ఎక్కువగా తినే ఫుడ్ గురించి ఆసక్తికర వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
చాలా మంది సెలబ్రెటీలు ఎక్కువగా ఇడ్లీ అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు. అందుకు ఒక ఉదాహరణే ఈ వీడియో. ఈ వీడియోలో ఇడ్లీ అంటే ఇష్టమని చాలా మంది సెలబ్రెటీలు చెప్పుకొచ్చారు.. ఇడ్లీ ప్రియులుగా మారిన సెలబ్రిటీలు ఎవరో ఒక్కసారి చూద్దాం.
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు ఆహారం పట్ల ఆయనకు ప్రత్యేక ప్రేమ. దుల్కర్ కు ఇడ్లీ అంటే చాలా ఇష్టం. ‘ఇడ్లీ లేదా చపాతీ’ అని ప్రశ్న అడిగితే, అతను ఇడ్లీ అని సమాధానం ఇచ్చాడు. అలాగే ప్రభాస్‌కి ఫుడ్ విషయంలో చాలా శ్రద్ధ ఉంది. సెట్‌కి ఆయన ఇంటి నుంచి భోజనం తెస్తారు. ప్రభాస్ తో పాటు ఉన్న ఆర్టిస్ట్ లకు కూడా ఇంటి నుంచి తెచ్చిన ఫుడ్డే పెడుతూ ఉంటారు.. ప్రభాస్ కు కూడా ఇడ్లీ అంటే చాలా ఇష్టం. అర్ధరాత్రి 12 నుంచి 1 సమయంలో దొరికే ఇడ్లీ తింటానని చెప్పారు ప్రభాస్. దీపికా పదుకొణె స్వస్థలం కర్ణాటక. ఆమెకు కూడా ఇడ్లీ అంటే ప్రత్యేకమైన ఇష్టం. అంతేకాదు ‘ఇడ్లీ డే’ కూడా ఉంది. ఆ రోజు గురించి తనకు తెలియదని దీపిక చెప్పింది. అదితిరావు హైదరీకి ఇడ్లీ అంటే చాలా ఇష్టమని తెలిపింది. తాను అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనంలో ఇడ్లీ మాత్రమే తినగలనని చెప్పింది. తనకు ఇడ్లీ అంటే అంత ఇష్టం అని చెప్పుకొచ్చింది. అలాగే కీర్తి సురేష్ కూడా తనకు ఇడ్లి అంటే ఇష్టం అని చెప్పుకొచ్చింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.