King of Kotha: ఎట్టకేలకు ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ నయా మూవీ.. కింగ్ ఆఫ్ కోత స్ట్రీమింగ్ ఎక్కడంటే
నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన మహానటి సినిమాలో జెమిని గణేష్ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు దుల్కర్. ఆ తర్వాత ఆయన నటించిన చాలా సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాయి. ఇక రీసెంట్ గా సీతారామం సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు. టాలీవుడ్ దర్శకుడు హనురాఘవాపుడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో లెఫ్టనెంట్ రామ్ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు దుల్కర్. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది.

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే మణిరత్నం తెరకెక్కించిన ఓకే బంగారం సినిమాతో సినిమా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు దుల్కర్. ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత డైరెక్ట్ గా తెలుగులో మహానటి సినిమాలో నటించాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన మహానటి సినిమాలో జెమిని గణేష్ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు దుల్కర్. ఆ తర్వాత ఆయన నటించిన చాలా సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాయి. ఇక రీసెంట్ గా సీతారామం సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు. టాలీవుడ్ దర్శకుడు హనురాఘవాపుడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో లెఫ్టనెంట్ రామ్ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు దుల్కర్. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది.
ఇక ఇప్పుడు కింగ్ ఆఫ్ కోత అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఇటీవలే థియేటర్స్ లో రిలీజ్ అయ్యి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుంది. అయితే కింగ్ ఆఫ్ కోత సినిమా ఓటీటీ రిలీజ్ పై గత కొద్దిరోజులుగా సస్పెన్స్ నడుస్తూంది.
ఆగస్టు 24న థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది ఈ మూవీ. అయితే సెప్టెంబర్ 22న ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు అంటూ ప్రచారం జరిగింది. కానీ ఆ ఓటీటీ సంస్థనుంచి మాత్రం ఎలాంటి అనౌన్స్ మెంట్ రాలేదు. అయితే సడన్ గా ఓటీటీలోకి వస్తుందేమో అనుకున్నారు కానీ అదీ జరగలేదు. ఇక ఇప్పుడు మరోసారి ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి టాక్ వినిపిస్తుంది. ఈ నెల 28 లేదా 29న ఓటీటీలోకి వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. హాట్‌స్టార్‌లో సెప్టెంబర్ 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది కింగ్ ఆఫ్ కోత . ఈ మేరకు హాట్‌స్టార్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
View this post on Instagram
దుల్కర్ సల్మాన్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.