AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishnu Manchu: న్యూజిలాండ్ లో మొదలైన కన్నప్ప షూటింగ్.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన విష్ణు

మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతోన్న సినిమా కన్నప్ప. భారీ బడ్జెట్ తో మంచు మోహన్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఇటీవలే మొదలైంది. ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కృతిసనన్ సిస్టర్ నూపుర్‌ సనన్‌ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో చాలా మంది నటీ నటులు నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ షేర్ చేశారు మంచు విష్ణు.

Vishnu Manchu: న్యూజిలాండ్ లో మొదలైన కన్నప్ప షూటింగ్.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన విష్ణు
Manchu Vishnu
Rajeev Rayala
|

Updated on: Sep 26, 2023 | 8:12 AM

Share

టాలీవుడ్ లో ప్రస్తుతం బడా సినిమాలు ఎక్కువగా సందడి చేస్తున్నాయి. ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలు పాన్ ఇండియా మూవీస్ పై ఎక్కువాగా ఫోకస్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ నుంచి కూడా చాలా సినిమాలు పాన్ ఇండియా మూవీస్ వస్తున్నాయి. అలా వస్తున్న సినిమాల్లో  కన్నప్ప సినిమా ఒకటి. మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతోన్న సినిమా కన్నప్ప. భారీ బడ్జెట్ తో మంచు మోహన్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఇటీవలే మొదలైంది. ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కృతిసనన్ సిస్టర్ నూపుర్‌ సనన్‌ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో చాలా మంది నటీ నటులు నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ షేర్ చేశారు మంచు విష్ణు.

భక్త కన్నప్ప సినిమా తెరకెక్కించాలన్నది నా ఏడేళ్ల కల అని అన్నారు మంచు విష్ణు. శివుడు, పార్వతి దేవి ఆశీర్వాదం తోనే అది సాధ్యం అవుతుందని అన్నారు మంచు విష్ణు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ న్యూజిలాండ్‌ లో జరుగుతోంది. ఈ రోజు న్యూజిలాండ్‌లో అందమైన లొకేషన్స్ లో మూవీ షూటింగ్ చేశాం. గత ఎనిమిది నెలలుగా ఈ ప్రాజెక్ట్ కోసం పని చేస్తోన్న ప్రతి ఒక్కరికి నిద్ర లేనిరాత్రులే మిగిలాయి.

పండుగలు మరచిపోయి.. సెలవులు మానేసి కేవలం 5 మాత్రమే నిద్రపోయారు. ఏడేళ్ల క్రితం తనికెళ్ల భరణి తొలిసారి కన్నప్ప గురించి చేర్చించినప్పటి నుంచి నేను ఈ సినిమా తెరకెక్కించాలని భావించా.. ఆ కథ నన్ను ఎంతగానో ఆకర్షించింది. కథను మెరుగుపరచడం నేను బాధ్యతగా తీసుకున్నా.. అని అన్నారు. ఈ ప్రాజెక్ట్ లో నాతో కలిసి ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. పరచూరి గోపాలకృష్ణ , విజయేంద్ర ప్రసాద్ , తోటపల్లి సాయినాథ్, తోట ప్రసాద్, నాగేశ్వర రెడ్డి , ఈశ్వర్ రెడ్డి స్క్రిప్ట్‌ను డవలెప్ చేయడానికి చాలా హెల్ప్ చేశారు. అలాగే ‘కన్నప్ప’ సినిమాకు  ప్రాణం పోసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 600 మంది నటీనటులు న్యూజిలాండ్‌లో కలిశాం. ప్రియమైన వారిని విడిచిపెట్టి వారు చేసిన త్యాగాలే ఈ ప్రాజెక్ట్‌పై నమ్మకానికి నిదర్శనం అనిరాసుకొచ్చారు విష్ణు. మా ప్రాజెక్ట్ గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.. ఎలాంటి లీకులు జరగకుండా మరింత జాగ్రతగా ఉంటాం అన్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్ శివుడిగా.. నయనతార పార్వతి దేవిగా నటిస్తున్నారని టాక్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రేపటితో డెడ్ లైన్ పూర్తి.. ఈ ఒక్క పని చేయకపోతే ఇబ్బందులే..
రేపటితో డెడ్ లైన్ పూర్తి.. ఈ ఒక్క పని చేయకపోతే ఇబ్బందులే..
దురంధర్‌‌ రికార్డులపై టాలీవుడ్ స్టార్ కన్ను.. బ్రేక్ చేసేస్తాడా?
దురంధర్‌‌ రికార్డులపై టాలీవుడ్ స్టార్ కన్ను.. బ్రేక్ చేసేస్తాడా?
Horoscope Today: వారి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి..
Horoscope Today: వారి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి..
తెలంగాణలో మరో ఎన్నికల జాతర.. ఫిబ్రవరిలో షెడ్యూల్..!
తెలంగాణలో మరో ఎన్నికల జాతర.. ఫిబ్రవరిలో షెడ్యూల్..!
ఒకేసారి రూ.3 వేలు తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి అవకాశం
ఒకేసారి రూ.3 వేలు తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి అవకాశం
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
వందే భారత్ స్లీపర్ రైళ్లపై బిగ్ అప్డేట్.. ప్రారంభం ఎప్పుడంటే..?
వందే భారత్ స్లీపర్ రైళ్లపై బిగ్ అప్డేట్.. ప్రారంభం ఎప్పుడంటే..?