AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salaar Part 1 – Ceasefire: క్రిస్మస్ ను టార్గెట్ చేసిన సలార్.. ప్రభాస్‌కు పోటీగా ఆ స్టార్ హీరో సినిమా కూడా..

ఇప్పుడు ఈ సినిమా క్రిస్మస్‌కి సిద్ధమైందని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో  తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రశాంత్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు సలార్  సినిమాకు గట్టిపోటీ ఉండనుందని తెలుస్తోంది. ప్రభాస్ సినిమాకు పోటీగా షారుక్ ఖాన్ సినిమా రానుందని తెలుస్తోంది.

Salaar Part 1 – Ceasefire: క్రిస్మస్ ను టార్గెట్ చేసిన సలార్.. ప్రభాస్‌కు పోటీగా ఆ స్టార్ హీరో సినిమా కూడా..
Salaar
Rajeev Rayala
|

Updated on: Sep 26, 2023 | 9:32 AM

Share

డార్లింగ్ ప్రభాస్ సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్ 28న ‘సలార్’ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల సినిమా విడుదల తేదీని వాయిదా వేసుకున్నారు చిత్రయూనిట్. ఇప్పుడు ఈ సినిమా క్రిస్మస్‌కి సిద్ధమైందని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో  తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రశాంత్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు సలార్  సినిమాకు గట్టిపోటీ ఉండనుందని తెలుస్తోంది. ప్రభాస్ సినిమాకు పోటీగా షారుక్ ఖాన్ సినిమా రానుందని తెలుస్తోంది. షారుఖ్ నటిస్తున్న డుంకీ సినిమాను కూడా అదే సమయంలో రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది.

హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సలార్’ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ అందరినీ ఆకట్టుకుంది. ఈ టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. అంతే కాదు కేజీఎఫ్ సినిమాకు సలార్ మధ్య లింక్ ఉందని అంటున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు ఈ సినిమా విడుదలకు సంబంధించిన కొత్త అప్‌డేట్ వచ్చింది. ఈ విషయాన్ని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు.

ఈ క్రిస్మస్ కోసం ‘డుంకీ  సాలార్ పోటీపడనున్నాయ్ . క్రిస్మస్ సందర్భంగా సాలార్ విడుదల చేయనున్నట్టు ఎగ్జిబిటర్లకు మెయిల్ వచ్చిందని సమాచారం. దీనిపై నిర్మాతలు శుక్రవారం (సెప్టెంబర్ 29) అధికారిక ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. ఈ విషాన్ని తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. హోంబలే ఫిలింస్ నిర్మిస్తున్న సినిమా, షారుక్ సినిమా ఒకే సారి రిలీజ్ అవ్వడం ఇది రెండో సారి. గతంలో షారుఖ్ ‘జీరో’, హోంబాలే ‘కేజీఎఫ్’ ఒకే సారి విడుదలయ్యాయి. అప్పట్లో ‘కేజీఎఫ్’ విజయం సాధించింది. ఇక ఇప్పుడు మరోసారి ఇదే పోటీ ఉండనుంది. సలార్, డుంకీ సినిమాల్లో ఏ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గణపతి నిమజ్జనం, అనంత చతుర్దశి ఒకే రోజున ఎందుకు? అసలు కారణం ఇదే!
గణపతి నిమజ్జనం, అనంత చతుర్దశి ఒకే రోజున ఎందుకు? అసలు కారణం ఇదే!
డబ్బుకు కొదవ ఉండకూడదా? ఇంట్లో ఈ వస్తువులు ఉంచండి!
డబ్బుకు కొదవ ఉండకూడదా? ఇంట్లో ఈ వస్తువులు ఉంచండి!
బంధువుల ఇంటికి వెళ్తున్నారా? చాణక్యుడు చెప్తోన్న టిప్స్ ఇవే..
బంధువుల ఇంటికి వెళ్తున్నారా? చాణక్యుడు చెప్తోన్న టిప్స్ ఇవే..
ప్రజలకు తెలంగాణ సర్కార్ అదిరే దసరా గిఫ్ట్.. వచ్చే నెలలోనే..
ప్రజలకు తెలంగాణ సర్కార్ అదిరే దసరా గిఫ్ట్.. వచ్చే నెలలోనే..
ఖైరతాబాద్ బడా గణేష్ భక్తులకు లాస్ట్ ఛాన్స్.. నిమజ్జనం ఎప్పుడంటే?
ఖైరతాబాద్ బడా గణేష్ భక్తులకు లాస్ట్ ఛాన్స్.. నిమజ్జనం ఎప్పుడంటే?
మహిళలు శ్రాద్ధం, పిండ ప్రదానం చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతుంది?
మహిళలు శ్రాద్ధం, పిండ ప్రదానం చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతుంది?
ఈయన ఒక దేశ మాజీ ప్రధాని అంటే నమ్ముతారా? స్టేషన్‌ లో ఇలా..!
ఈయన ఒక దేశ మాజీ ప్రధాని అంటే నమ్ముతారా? స్టేషన్‌ లో ఇలా..!
జపాన్‌తో మ్యాచ్‌లో ఊహించని డ్రామా.. అంపైర్‎ను బెదిరించి గెలిచారా
జపాన్‌తో మ్యాచ్‌లో ఊహించని డ్రామా.. అంపైర్‎ను బెదిరించి గెలిచారా
72వ జాతీయ చలనచిత్ర అవార్డులు.. విజేతలుగా నిలిచింది వీరే..
72వ జాతీయ చలనచిత్ర అవార్డులు.. విజేతలుగా నిలిచింది వీరే..
హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. ఉరుములు, మెరుపులు...
హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. ఉరుములు, మెరుపులు...