Drishyam 2 : భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న సినిమా సెట్.. ఆలోచనలో పడ్డ దృశ్యం2 మేకర్స్..

మలయాళం  మంచి విజయాన్ని అందుకున్న సస్పెన్స్ థ్రిల్లర్ దృశ్యం. మోహన్ లాల్, మీనా నటించిన ఈ సినిమా తెలుగులో రీమేక్ అయినా విషయం తెలిసిందే.

Drishyam 2 : భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న సినిమా సెట్.. ఆలోచనలో పడ్డ దృశ్యం2 మేకర్స్..
Drushyam 2 Movie
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 01, 2021 | 7:37 AM

Drishyam 2 :

మలయాళం  మంచి విజయాన్ని అందుకున్న సస్పెన్స్ థ్రిల్లర్ దృశ్యం. మోహన్ లాల్, మీనా నటించిన ఈ సినిమా తెలుగులో రీమేక్ అయినా విషయం తెలిసిందే. తెలుగులో విక్టరీ వెంకటేష్, మీనా నటించారు. ఇటీవలే ఈ సినిమాకు సీక్వెల్ దృశ్యం 2ను తెరకెక్కించారు. ఇప్పుడు ఈ సీక్వెల్ కూడా తెలుగులో రీమేక్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను కూడా మొదలు పెట్టేసారు. దృశ్యం 2 కు సురేశ్ బాబు ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను మలయాళంలో కేవలం 45 రోజుల్లోనే తీసాడు దర్శకుడు జీతూ జోసెఫ్. థియేటర్స్ జోలికి వెళ్లకుండా ఫిబ్రవరి 19న అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా విడుదల చేసారు.

అయితే తెలుగులో రీమేక్ అవుతున్న దృశ్యం 2 కూడా ఓటీటీ వేదికగానే విడుదలవుతుందని గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కి చెందిన ఒక ప్రముఖ సంస్థవారు భారీ ఆఫర్ ఇవ్వడంతో నిర్మాతలు అంగీకరించారనీ, అందువలన ఈ సినిమా ఓటీటీ ద్వారానే రానుందనే టాక్ నడుస్తుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ సెట్ కూలిపోయినట్లు తెలుస్తుంది. ఇటీవల కేరళలో కురిసిన వర్షాలకు.. ఆకస్మికంగా సంభవించిన తుఫాన్ కారణంగా దృశ్యం సెట్ డామేజ్ అయిపోయిందట. అయితే దృశ్యం-2 షూటింగ్ ఇంకాస్త మిగిలి ఉండటంతో ఆ షూటింగ్ ఇప్పట్లో జరపడం వీలు కాదు కాబట్టి.. కరోనా పరిస్థితి నుండి బయట పడగానే ఆ మిలిగిన వర్క్ కంప్లీట్ చేయాలనీ మేకర్స్  భావిస్తున్నారట. ఇప్పటికే తుఫాన్ వర్షాల కారణంగా వేరే సినిమాల సెట్స్ కూడా డామేజ్ అయ్యాయని తెలిసిందే.

మరిన్ని ఇక్కడ చదవండి :

Lucifer Movie: మెగాస్టార్ ‘లూసిఫర్’ మూవీ అప్‏డేట్.. పోస్టర్‏తో రూమర్స్‏కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. అసలు విషయం ఎంటంటే..

అర్ధరాత్రి నా కారును నలుగురు దుండగులు వెంబడించారు.. అది చాలా భయంకరమైన రోజు.. చేదు అనుభవాన్ని చెప్పిన నటి..

బిగ్‏బాస్‏లోకి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గర్ల్ ఫ్రెండ్ ?.. కంటెస్టెంట్స్ లిస్ట్ రెడీ చేస్తోన్న నిర్వాహకులు.. ఎవరెవరంటే..

శ్రీవారి భక్తులు అలెర్ట్.. మారిన మార్చి నెల టికెట్ల జారీ డేట్
శ్రీవారి భక్తులు అలెర్ట్.. మారిన మార్చి నెల టికెట్ల జారీ డేట్
చలికాలంలో నెయ్యి తింటే మంచిదేనా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
చలికాలంలో నెయ్యి తింటే మంచిదేనా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
బాక్సింగ్ డే టెస్ట్‌కు ప్రాక్టీస్ లేకుండానే భారత్ బరిలోకి..?
బాక్సింగ్ డే టెస్ట్‌కు ప్రాక్టీస్ లేకుండానే భారత్ బరిలోకి..?
ఈ ఒక్క ఆకు జ్యూస్‌తో క్యాన్సర్, షుగర్, గుండె సమస్యలన్నీ పరార్‌..!
ఈ ఒక్క ఆకు జ్యూస్‌తో క్యాన్సర్, షుగర్, గుండె సమస్యలన్నీ పరార్‌..!
IND vs PAK: ఛాంపియన్స్ ట్రోఫీలో హై ఓల్టేజ్ మ్యాచ్ డేట్ ఇదే..
IND vs PAK: ఛాంపియన్స్ ట్రోఫీలో హై ఓల్టేజ్ మ్యాచ్ డేట్ ఇదే..
కెప్టెన్‌గా రింకూ సింగ్.. ఐపీఎల్ 2025 కంటే ముందే సర్‌ప్రైజ్
కెప్టెన్‌గా రింకూ సింగ్.. ఐపీఎల్ 2025 కంటే ముందే సర్‌ప్రైజ్
వారు తిరుమల వెళ్లి వస్తుండగా.. వీరు దర్గ వద్ద కూర్చుని ఉండగా..
వారు తిరుమల వెళ్లి వస్తుండగా.. వీరు దర్గ వద్ద కూర్చుని ఉండగా..
ఉలవలతో ఇంత మేలు జరుగుతుందా..? తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
ఉలవలతో ఇంత మేలు జరుగుతుందా..? తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
ఆ సినిమాలో ఒకే ఒక్క డైలాగ్.. ఓయో హోటల్స్ పెట్టేలా చేసింది
ఆ సినిమాలో ఒకే ఒక్క డైలాగ్.. ఓయో హోటల్స్ పెట్టేలా చేసింది
నాగపాము తలలో నిజంగానే మణి ఉంటుందా..? ఇదిగో వీడియో...
నాగపాము తలలో నిజంగానే మణి ఉంటుందా..? ఇదిగో వీడియో...