హిట్టు మూవీ సీక్వెల్‌లో జాన్వీ కపూర్

శ్రీ దేవి త‌న‌య జాన్వీ క‌పూర్ హిట్ సినిమా సీక్వెల్‌లో న‌టించ‌నున్నారు. ఇంత‌కు ఆమె న‌టించ‌న‌బోయే సీక్వెల్ సినిమా ఏదో తెలుసా!..`దోస్తానా 2`.  2008లో రూపొందింది `దోస్తానా`. దాదాపు 11 ఏళ్ల త‌ర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ తెర‌కెక్క‌నుంది. సీక్వెల్ ద్వారా కొలిన్ డి. కున్హా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ప్రియాంక చోప్రా, అభిషేక్ బ‌చ్చ‌న్‌, జాన్ అబ్ర‌హం న‌టించిన `దోస్తానా` చాలా మంచి విజ‌యాన్ని అందుకుంది. ఇప్పుడు సీక్వెల్‌లో ప్రియాంక స్థానంలో జాన్వీక‌పూర్ న‌టిస్తున్నారు. ఇక […]

  • Ram Naramaneni
  • Publish Date - 5:18 am, Sat, 29 June 19
హిట్టు మూవీ సీక్వెల్‌లో జాన్వీ కపూర్

శ్రీ దేవి త‌న‌య జాన్వీ క‌పూర్ హిట్ సినిమా సీక్వెల్‌లో న‌టించ‌నున్నారు. ఇంత‌కు ఆమె న‌టించ‌న‌బోయే సీక్వెల్ సినిమా ఏదో తెలుసా!..`దోస్తానా 2`.  2008లో రూపొందింది `దోస్తానా`. దాదాపు 11 ఏళ్ల త‌ర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ తెర‌కెక్క‌నుంది. సీక్వెల్ ద్వారా కొలిన్ డి. కున్హా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ప్రియాంక చోప్రా, అభిషేక్ బ‌చ్చ‌న్‌, జాన్ అబ్ర‌హం న‌టించిన `దోస్తానా` చాలా మంచి విజ‌యాన్ని అందుకుంది. ఇప్పుడు సీక్వెల్‌లో ప్రియాంక స్థానంలో జాన్వీక‌పూర్ న‌టిస్తున్నారు. ఇక ఇద్ద‌రు హీరోస్‌లో ఒక‌రు కార్తీక్ ఆర్య‌న్ న‌టిస్తుండ‌గా.. మ‌రో కొత్త హీరోను ప‌రిచ‌యం చేస్తామ‌ని ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్ తెలిపారు. క‌ర‌ణ్ జోహాన్ ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్స్‌లో జాన్వీక‌పూర్ చేస్తోన్న మూడో చిత్ర‌మిది.