Manasantha Nuvve Movie: ఉదయ్ కిరణ్ ‘మనసంత నువ్వే’ హీరోయిన్ గుర్తుందా ?.. రీమా సేన్ ఇప్పుడేం చేస్తుందో తెలుసా..
ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు శ్రోతలను ఆకట్టుకుంటాయి. అయితే ఈ సినిమాలో అందం, అభినయంతో మెప్పించింది హీరోయిన్ రీమాసేన్. ఈ సినిమా తర్వాత పలు చిత్రాల్లో నటించిన రీమా సేన్ .. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. మరీ ఇప్పుడేం చేస్తుంది.. ఎలా మారిందో తెలుసుకుందామా.

వెండితెరపై ఎన్నో అందమైన ప్రేమకథలు ప్రేక్షకులను అలరించాయి. ఆడియన్స్ మనసును తాకి.. కన్నీళ్లు పెట్టించిన కథలూ ఉన్నాయి. ఇప్పటికీ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ సినిమాల్లో మనసంతా నువ్వే ఒకటి. ఎంఎస్ రాజు నిర్మాతగా.. వి.ఎన్.ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ మూవీ 2001లో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో దివంగత హీరో ఉదయ్ కిరణ్, రీమా సేన్ హీరోహీరోయిన్లుగా నటించగా.. తనికెళ్ల భరణి, సునీల్, తనూరాయ్, చంద్రమోహన్ కలకీపాత్రలలో నటించారు. ఈ చిత్రానికి ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించారు. ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు శ్రోతలను ఆకట్టుకుంటాయి. అయితే ఈ సినిమాలో అందం, అభినయంతో మెప్పించింది హీరోయిన్ రీమాసేన్. ఈ సినిమా తర్వాత పలు చిత్రాల్లో నటించిన రీమా సేన్ .. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. మరీ ఇప్పుడేం చేస్తుంది.. ఎలా మారిందో తెలుసుకుందామా.
రీమా సేన్.. 1981 అక్టోబర్ 29న కోల్ కత్తాలో జన్మించింది. అక్కడే విద్యాభ్యాసం పూర్తిచేసిన ఆమె.. నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. అనేక ప్రకటనలలో నటించిన తర్వాత ఉదయ్ కిరణ్ సరసన మనసంతా నువ్వే సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. ఇదే ఆమె తొలి సినిమా. ఈ మూవీ తర్వాత హమ్ హూయే ఆప్ కే సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అయితే ఈ సినిమా పరాజయం కావడంతో అంతగా క్లిక్ కాలేకపోయింది.




తెలుగు, హిందీతోపాటు.. ఆమె తమిళ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టింది. ఆమె నటించిన రెండు చిత్రాలు అక్కడ హిట్ అయ్యాయి. తెలుగుతోపాటు.. తమిళంలోనూ పలు హిట్ చిత్రాల్లో నటించిన రీమాసేన్.. 2012లో వ్యాపారవేత్త శివ్ కరణ్ సింగ్ ను వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత రీమాసేన్ సినిమాలకు పూర్తిగా దూరమైంది. ప్రస్తుతం ఆమె తన కుటుంబంతో కలిసి ముంబైలో నివసిస్తున్నారు. రీమాసేన్ ఎక్కువగా ఈవెంట్లలో పాల్గొనడానికి ఇంట్రెస్ట్ చూపించరు. కానీ సోషల్ మీడియాలో తన ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేస్తుంటారు రీమాసేన్.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.