Salman Khan: సల్మాన్ ఖాన్ ‘ఏంటమ్మ’ సాంగ్ పై మాజీ క్రికెటర్ ఆగ్రహం.. మరీ ఇంత అసహ్యంగా చూపిస్తారా అంటూ..
సల్మాన్.. వెంకీ.. చరణ్ ముగ్గురు కలిసి లుంగీ డ్యాన్స్ తరహాలో చేసిన ఈ పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ పాటపై మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివ రామకృష్ణన్ అసహనం వ్యక్తం చేశారు. ఈ పాట దక్షిణ భారత సంస్కృతిని కించపరిచేలా ఉందంటూ ఆరోపించారు లక్ష్మణ్.

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్.. టాలీవుడ్ బుట్టబొమ్మ జంటగా నటిస్తోన్న చిత్రం ‘కిసీ కా భాయ్.. కిసీ కా జాన్’. ఈ సినిమా అటు నార్త్.. ఇటు సౌత్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సినీ ప్రియులను మెప్పించాయి. ఇక ఇటీవల విడుదలైన ఏంటమ్మ పాటకు వచ్చిన రెస్పాన్స్ గురించి చెప్పక్కర్లేదు. సల్మాన్ తోపాటు.. విక్టరీ వెంకటేశ్ పంచెకట్టులో డాన్స్ చేసి అలరించగా.. వీరిధ్దరి మధ్యలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రావడం మరింత హైలెట్ అయ్యింది. దీంతో విడుదలైన క్షణాల్లోనే సోషల్ మీడియాలో తెగ వైరలయ్యింది. సల్మాన్.. వెంకీ.. చరణ్ ముగ్గురు కలిసి లుంగీ డ్యాన్స్ తరహాలో చేసిన ఈ పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ పాటపై మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివ రామకృష్ణన్ అసహనం వ్యక్తం చేశారు. ఈ పాట దక్షిణ భారత సంస్కృతిని కించపరిచేలా ఉందంటూ ఆరోపించారు లక్ష్మణ్. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందమా.
“ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈ పాటకు హీరోలు ధరించింది లుంగీ కాదు.. ధోతి. దానిని లుంగీగా చూపించారు. ఇది దక్షిణ భారత సంస్కృతిని కించపరిచేలా ఉంది. క్లాసిక్ దుస్తులను చాలా అసహ్యకరమైన రీతిలో చూపించారు. ఈరోజుల్లో డబ్బు కోసం ఏ పనైనా చేస్తారు. లుంగీ ధోతికి తేడా ఏంటో కూడా కనీసం తెలుసుకోరు. ” అంటూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఆలయంలో నటీనటులు షూస్ ధరించి ఎలా డ్యాన్స్ చేస్తారని ప్రశ్నించారు. సౌత్ ఇండియా సంస్కృతిని కించపరిచేలా ఉందని.. వెంటనే ఈ పాటను బ్యాన్ చేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ను ట్యాగ్ చేస్తూ ఆయన ట్వీట్ చేశారు.




సల్మాన్ ఖాన్, వెంకటేశ్, పూజా హెగ్డే కలిసి నటించిన ఈ సినిమా ఏప్రిల్ 21న విడుదల కానుంది. ఈ చిత్రానికి ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పలువురు కీలకపాత్రలలో నటిస్తున్నారు.
This is highly ridiculous and degrading our South Indian culture. This is not a LUNGI , THIS IS A DHOTI. A classical outfit which is being shown in a DISGUSTING MANNER https://t.co/c9E0T2gf2d
— Laxman Sivaramakrishnan (@LaxmanSivarama1) April 8, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




