Tollywood: ఉదయ్ కిరణ్ జోడిగా నటించిన ఈ భామ.. ఇప్పుడు ఇండియాలోని రిచెస్ట్ హీరోయిన్..
దివ్య ఖోస్లా కుమార్ ఒకరు. ఈ పేరు చెబితే తెలుగు ప్రేక్షకులు అస్సలు గుర్తుపట్టలేరు. కానీ దివంగత హీరో ఉదయ్ కిరణ్ నటించిన లవ్ టూడే హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తుంటారు. 2004లో ఉదయ్ కిరణ్ సరసన లవ్ టూడే మూవీతో తన సినీ ప్రయాణం స్టార్ట్ చేసింది. ఈ మూవీకి అప్పట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ దివ్యకు మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు.

తెలుగు తెరపై చాలా మంది హీరోయిన్స్ తళుక్కున మెరిసి అంతలోనే ఇండస్ట్రీకి దూరమయ్యారు. హిందీ, తమిళం భాషలలో అనేక సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న పలువురు తారలకు తెలుగులో మాత్రం అవకాశాలు రాలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క సినిమా చేసినా తమకంటూ ఓ క్రేజ్ సంపాదించుకున్నారు. కానీ ఆ తర్వాత మళ్లీ మరో ప్రాజెక్ట్ చేయలేదు. అలాంటి వారిలో దివ్య ఖోస్లా కుమార్ ఒకరు. ఈ పేరు చెబితే తెలుగు ప్రేక్షకులు అస్సలు గుర్తుపట్టలేరు. కానీ దివంగత హీరో ఉదయ్ కిరణ్ నటించిన లవ్ టూడే హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తుంటారు. 2004లో ఉదయ్ కిరణ్ సరసన లవ్ టూడే మూవీతో తన సినీ ప్రయాణం స్టార్ట్ చేసింది. ఈ మూవీకి అప్పట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ దివ్యకు మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు.
ఆ తర్వాత అబ్ తుమారే హవాలే వాటా సాథియే సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్, బాబీ డియోల్ ప్రధాన పాత్రలు పోషఇంచారు. సినిమాల్లో కాకుండా పలు సాంగ్ ఆల్బమ్స్ చేసింది. అప్పట్లో పాప్ సంగీత ప్రపంచంలో మెరిసింది దివ్య. ఫల్గుణి పాఠక్ మ్యూజిక్ వీడియో అయ్యో రామా పాటలో కనిపించింది దివ్య. ఈ సాంగ్ అప్పట్లో పెద్ద సంచలనమే. చందమామలాంటి కళ్లు.. నిండైన రూపంతో ఆకట్టుకుంది. హిందీలో సల్మాన్ ఖాన్ సరసన జిద్ నా కరో యే దిల్ కాతో సహ అనేక మ్యూజిక్ ఆల్బమ్స్ చేసింది.
అయితే 2004లో అబ్ తుమారే హవాలే వాట సాథియే సినిమా దివ్యకు హిందీలో ఫస్ట్ మూవీ. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే ప్రముఖ నిర్మాణ సంస్థ టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఆమెను మొదటిసారి చూసి ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఇరు కుటుంబసభ్యుల అంగీకారంతో 2005లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2011లో ఓ బాబు జన్మించాడు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. 2016లో సనమ్ రే సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. పెళ్లి తర్వాత దర్శకురాలిగా, నిర్మాతగా వ్యవహరిస్తూ పలు సినిమాలు నిర్మించింది. నివేదికల ప్రకారం దివ్య ఖోస్లా నికర విలువ 5 మిలియన్లు. అంటే రూ. 42 కోట్లు. హురున్ ఇండియ్ రిచ్ లిస్ట్ 2022లో ఆమె కుటుంబం నికర రూ. 10,000 కోట్లతో 175 అత్యంత సంపన్న భారతీయుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా కాలం గ్యాప్ తర్వాత దివ్య నటిస్తున్న సినిమా హీరోహీరోయిన్. తెలుగు, హిందీలో ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు.
vమరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



