AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gummadi Narsaiah: గుమ్మడి నరసయ్యగా స్టార్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా.?

ఇప్పటికే తెలుగులో ఎన్నో బయోపిక్స్ తెరకెక్కి మంచి విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు మన ముందుకు మరో నిజ జీవితకథ రాబోతుంది. గుమ్మడి నరసయ్య జీవిత కథతో ఓ సినిమా పేక్షకుల ముందుకు రాబోతుంది. ఓ స్టార్ హీరో ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు.

Gummadi Narsaiah: గుమ్మడి నరసయ్యగా స్టార్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా.?
Gummadi Narsaiah
Rajeev Rayala
|

Updated on: Oct 22, 2025 | 8:04 PM

Share

తెలుగు సినిమా స్థాయి రోజు రోజుకు పెరిగిపోతుంది.. ఎన్నో అద్భుతమైన సినిమాలు తెలుగులో తెరకెక్కుతూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇప్పుడు అలాంటి మరో అద్భుతమైన సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఎన్నో రకాల బయోపిక్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇప్పుడు మరో బయోపిక్ పేక్షకుల ముందుకు రాబోతుంది. గుమ్మడి నరసయ్య గారి జీవిత కథతో ఇప్పుడు సినిమా తెరకెక్కుతుంది. గుమ్మడి నరసయ్య తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ రాజకీయవేత్త, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) – న్యూ డెమోక్రసీ పార్టీకి సీనియర్ నేత. పార్టీకి ప్రాతినిధ్యం వహించి ఇల్లెందు శాసనసభ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ సభ్యుడిగా ఐదుసార్లు (1983–1994, 1999–2009) గెలుపొందిన ఏకైక నేత ఆయన.

బ్రేకప్‌పై స్పందించిన రష్మిక.. అమ్మాయిలకే ఆ బాధ ఎక్కువగా ఉంటుందన్న నేషనల్ క్రష్

గుమ్మడి నరసయ్య నిరాడంబర జీవనశైలికి ప్రసిద్ధి. ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ బస్సులోనో లేదా ట్రైన్‌లోనో హైదరాబాద్ వచ్చి, పార్టీ ఆఫీసులో పండుకుని ఆటోలో అసెంబ్లీకి వెళ్లేవారు. ఐదుసార్లు గెలిచినా పబ్లిసిటీ చేసుకోలేదు, జీతం అంతా పార్టీకి ఇచ్చేవారు. కొద్ది పాటి పొలం తప్ప సొంత ఆస్తులు లేవు. ఇప్పటికీ ఎర్రబస్సులో ప్రయాణిస్తూ, కంటి పరీక్షల కోసం సాధారణ క్యూలో నిలబడి, ప్రజల మధ్యే ఉంటూ జీవిస్తున్నారు. పేదలకు ఆదుకోవడం, స్వార్థం లేని మనస్సు కలిగిన నాయకుడిగా ప్రజల్లో గొప్ప గౌరవం సొంతం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

బోల్డ్ సీన్స్ దెబ్బకు బ్యాన్ చేశారు.. కట్ చేస్తే భాష మార్చి ఓటీటీలోకి వదిలారు..

ఇప్పుడు ఆయన జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కుతుంది. కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ గుమ్మడి నరసయ్య పాత్రలో కనిపిస్తున్నారు. ఈ దర్శకుడిగా పరమేశ్వర్ వ్యవహరిస్తున్నారు. తాజాగా విడుదలైన శివన్న లుక్, వీడియో గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. గుమ్మడి నరసయ్య పాత్రలో శివన్న ఒదిగిపోయారు. ఆయన లుక్ ఎంతో రియలిస్టిక్ గా ఉంది. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.

తొలి సినిమాకు రూ.10 రెమ్యునరేషన్.. కట్ చేస్తే 300లకు పైగా మూవీస్.. ఇప్పటికే అదే అందం

గుమ్మడి నరసయ్య..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు
రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు
సాయంత్రం 6 లోపే డిన్నర్.. మీ జీవితంలో జరిగే మార్పులివే..
సాయంత్రం 6 లోపే డిన్నర్.. మీ జీవితంలో జరిగే మార్పులివే..
నేరుగా మీ ఇంటికే ప్రసాదం.. మేడారం భక్తుల కోసం ఆర్టీసీ ఏర్పాట్లు
నేరుగా మీ ఇంటికే ప్రసాదం.. మేడారం భక్తుల కోసం ఆర్టీసీ ఏర్పాట్లు
హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం
హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం
అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..
అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..
మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే
మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే
రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!
రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!
యూపీఐ వాడేవారికి త్వరలో షాక్.. ఛార్జీలు విధింపు..?
యూపీఐ వాడేవారికి త్వరలో షాక్.. ఛార్జీలు విధింపు..?
లైవ్ మ్యాచ్‌లో బాబర్ ఆజంను అవమానించిన స్టీవ్ స్మిత్.. కట్‌చేస్తే.
లైవ్ మ్యాచ్‌లో బాబర్ ఆజంను అవమానించిన స్టీవ్ స్మిత్.. కట్‌చేస్తే.