Jr.NTR : అయ్య బాబోయ్.. గత్తరలేపుతోన్న ఎన్టీఆర్ సినిమాలోని చైల్డ్ ఆర్టిస్ట్.. ఈ చిన్నారి ఇప్పుడేం చేస్తుందంటే..
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ పూర్తికానుంది. ఈ సినిమాతోపాటు అటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ మూవీ చేస్తున్నాడు తారక్. తాజాగా ఎన్టీఆర్ త్రోబ్యాక్ ఫోటో నెట్టింట తెగ వైరలవుతుంది.

ఒకప్పుడు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టులుగా మెరిసిన చిన్నారులు.. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నారు. అప్పట్లో బాలనటీనటులుగ మెప్పించి.. ఇప్పుడు వెండితెరపై హీరోహీరోయిన్లుగా రాణిస్తున్నారు. తేజా సజ్జా, బలగం కావ్య కళ్యాణ్ రామ్, శ్రీదివ్య, సంగీత్ శోభన్ వంటి స్టార్స్ ఒకప్పుడు అగ్ర హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టులే. అలాంటి వారిలో ఈ అమ్మాయి ఒకరు. పైన ఫోటోను చూస్తున్నారా.. ? ఎన్టీఆర్ ఒడిలో ఉన్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..? తెలుగులో అనేక సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించింది. రవితేజ, ఎన్టీఆర్, వెంకటేశ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో బాలనటిగా కనిపించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత చదువుల కోసం సినిమాలకు దూరమైంది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం అందాలతో గత్తరలేపుతోంది. తాజాగా ఈ వయ్యారి లేటేస్ట్ ఫోటోస్ చూసి షాకవుతున్నారు నెటిజన్స్. అప్పట్లో అమాయకంగా ఎంతో ముద్దుగా కనిపించిన ఈ చిన్నారి.. ఇప్పుడు హీరోయిన్లకు ధీటుగా మారిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ చిన్నారిని మీరు గుర్తుపట్టారా.. ? తన పేరు గ్రీష్మ నేత్రిక.
గ్రీష్మ నేత్రిక.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు అంతగా గుర్తుండకపోవచ్చు. కానీ వెంకటేశ్ నటించిన మల్లీశ్వరి సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఈ మూవీలో వెంకీ అన్న కూతురిగా కనిపించింది. ముద్దు ముద్దు మాటలు.. అమాయకమైన నటనతో కట్టిపడేసింది. తెలుగులో ఎన్టీఆర్ నటించిన సాంబా, అశోక్, రవితేజ నటించిన దుబాయ్ శీను, వెంకటేశ్ నటించిన మల్లీశ్వరి చిత్రాల్లో నటించింది గ్రీష్మ. ఆ తర్వాత చదువుల కోసం సినిమాలకు దూరంగా ఉండిపోయింది.
తెలుగులో అమ్ములు, కొంచం ఇష్టం కొంచం కష్టం, ప్రస్తానం, పంచాక్షరి, ఏమో గుర్రం ఎగరవచ్చు వంటి చిత్రాల్లో నటించిన గ్రీష్మ.. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అటు గ్లామర్, ఇటు ట్రెడిషనల్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు లేటేస్ట్ ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :