Chandramukhi: చంద్రముఖి సినిమాలో కనిపించిన ఈ బ్యూటీ గుర్తుందా.. ? ఇప్పుడేలా మారిపోయిందో చూశారా.. ?
చంద్రముఖి.. సౌత్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హిట్. తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ఈ సినిమాను తెలుగులోనూ విడుదల చేయగా.. మంచి విజయాన్ని అందుకుంది. హారర్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే అతిశయోక్తి కాదు. ఇందులో నటించిన నటీనటులు ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లో వన్ ఆఫ్ ది హిట్ మూవీ అంటే చంద్రముఖి. 2005లో విడుదలైన ఈ మూవీ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇందులో జ్యోతిక, నయనతార, ప్రభు, మాళవిక, వడివేలు, సోనూసూద్ కీలకపాత్రలు పోషించారు. అప్పట్లోనే ఈ సినిమా 60 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. డైరెక్టర్ పి.వాసు దర్శకత్వం వహించిన ఈ మూవీలోని సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాలో నటించిన చాలా మంది నటీనటులు ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఇక ఇందులో నాసర్ చిన్నకూతురిగా కనిపించిన అమ్మాయి గుర్తుందా..? ఇప్పుడు ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకుందామా.
ఇవి కూడా చదవండి : Cinema: రిషబ్ శెట్టి కాంతారా వెనక్కు నెట్టిన సినిమా.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..
చంద్రముఖి సినిమాలో నాజర్ చిన్నకూతురిగా కనిపించిన ఆ అమ్మాయి పేరు సుజిపాల. ఆమె నాజర్ పాత్ర కందసామి చిన్న కుమార్తెగా నటించింది. నాజర్ రజనీకాంత్‌తో మాట్లాడుతున్నప్పుడు, డాక్టర్, “నిన్న రాత్రి మీరు మీ అద్దాలను నా గదిలో వదిలి వెళ్ళారు” అని చెప్పడం.. అప్పుడు నాజర్ స్పందించిన తీరు. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఈ చిత్రంలో నాజర్, రజినీకి మధ్య వచ్చే సీన్స్ హైలెట్ అయ్యాయి. తన ఇద్దరు కుమార్తెల కోసం నాజర్ పడే టెన్షన్ జనాలను నవ్వులు తెప్పిస్తుంది. ఇందులో కనిపించిన నటి సుజిపాల ఇప్పుడేం చేస్తుందో తెలుసుకుందామా.
ఇవి కూడా చదవండి : Actor: అమ్మాయిల క్రేజీ హీరో.. రియల్ లైఫ్‌లో సూపర్ స్టార్.. విమానం నడిపే ఏకైక హీరో అతడు..
2003లో విజయకాంత్ నటించిన తెన్నవన్ సినిమాలో ఆమె నర్సు పాత్ర పోషించింది. ఆ తర్వాత కన్నడ, తమిళం భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. చంద్రముఖి ఆమెకు 6వ సినిమా. ఈ సినిమా పెద్ద హిట్ అయిన తర్వాత, ఆమె రంజిత్ డాన్ సెరాలో నటించింది. ఆమె చివరిగా 2016లో తిరునాల్, అంజిక్కు ఒన్ను సినిమాల్లో నటించింది. తెలుగుతోపాటు కన్నడ, మలయాళం, తమిళం భాషలలో అనేక చిత్రాల్లో ముఖ్యపాత్రలు పోషించింది. ఇప్పుడు ఆమె బుల్లితెరపై పలు సీరియల్స్ చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
ఇవి కూడా చదవండి : Baby Movie: అమ్మడు నువ్వేనా ఇలా.. బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Kantara: 17 ఏళ్ల స్నేహం.. రిషబ్ శెట్టి కోసం కాంతార సినిమాలో ఇలా.. ఈ నటుడు ఎవరో తెలుసా.. ?








