Pilisthe Palukutha: ‘పిలిస్తే పలుకుతా’ సినిమా హీరోయిన్ గుర్తుందా ? ఇప్పుడెం చేస్తుందో తెలుసా..
2003 జనవరి 3న విడుదలైన పిలిస్తే పలుకుతా చిత్రం అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జై ఆకాష్, షమితా శెట్టి, విజయ్ చందర్, సునీల్, ధర్మవరపు సుబ్రమణ్యం, చంద్రమోహన్ కీలకపాత్రలలోనటించారు. ఈ చిత్రాన్ని ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించారు.
తెలుగు చిత్రపరిశ్రమలో పలువురు హీరోయిన్స్ తొలి సినిమాతోనే సూపర్ హిట్స్ అందుకున్నారు. అందం, అభినయంతో మెప్పించి ఆడియన్స్ మనసు దొచుకున్నారు. కానీ అంతలోనే ఇండస్ట్రీకి దూరమయ్యారు. కొందరు ఒకటి రెండు చిత్రాల తర్వాత ఇండస్ట్రీకి దూరమయితే.. మరికొందరు మాత్రం తొలి సినిమాతోనే చిత్రాలకు గుడ్ బై చెప్పేశారు. అలాంటి హీరోయిన్లలో షమితా శెట్టి ఒకరు. 2003 జనవరి 3న విడుదలైన పిలిస్తే పలుకుతా చిత్రం అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జై ఆకాష్, షమితా శెట్టి, విజయ్ చందర్, సునీల్, ధర్మవరపు సుబ్రమణ్యం, చంద్రమోహన్ కీలకపాత్రలలోనటించారు. ఈ చిత్రాన్ని ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించారు. ఈ సినిమానే కాకుండా ఈ చిత్రంలోని సాంగ్స్ కూడా ఇప్పటికీ ఎవర్ గ్రీన్ . ఈ చిత్రంలో మనసా ఒట్టు మాటాడొద్దు సాంగ్ ఇప్పటికీ శ్రోతలకు ఫేవరేట్.
ఈ చిత్రంలో అందం… అంతకు మించిన సహజ నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దొచుకుంది షమితా శెట్టి. అయితే తెలుగులో ఈ ముద్దుగుమ్మ చేసింది ఒకే ఒక్క సినిమా. ఈ అమ్మడు మరెవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి చెలెల్లు. ప్రస్తుతం ఈ అమ్మడుకు 40 ఏళ్లు. అయినా పెళ్లిపై మాత్రం ఆసక్తి చూపించడం లేదు. అలాగని వరుస సినిమాలతో బిజీగా కూడా లేదు.
అయితే షమితా గతంలో హిందీ బిగ్ బాస్ షోలో పాల్గోంది. ఇందులో తనతోపాటు పాల్గోన్న రాకేష్ బాపత్ తో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. కానీ వీరి లవ్ ఎక్కువ రోజులు కొనసాగలేదు. కొద్దిరోజులకే తాము విడిపోయామంటూ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు షమితా శెట్టి, రాకేష్ బాపత్. ప్రస్తుతం షమితా.. ముంబైలో తన సోదరి శిల్పాశెట్టితో ఉంటుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.