Ram Gopal Varma: కీరవాణి మాటలకు ఆర్జీవీ ఎమోషనల్.. నాకు చనిపోయినట్లు అనిపిస్తోందంటూ ట్వీట్..

తన తొలి ఆస్కార్ వర్మ అని.. ఆ తర్వాత నాటు నాటు పాటకు వచ్చిన ఆస్కార్ రెండోది అంటూ వ్యాఖ్యనించారు. సంగీత దర్శకుడిగా అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలో దాదాపు 51మందిని కలిశాను. వాళ్లలో కొందరు నేను కట్టిన ట్యూన్స్ క్యాసెట్లను చెత్తబుట్టలో విసిరేశారు.

Ram Gopal Varma: కీరవాణి మాటలకు ఆర్జీవీ ఎమోషనల్.. నాకు చనిపోయినట్లు అనిపిస్తోందంటూ ట్వీట్..
Rgv, Keeravani
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 26, 2023 | 1:23 PM

ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ అందుకున్నారు మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి. తాజాగా ఆయన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై ప్రశంసలు కురిపించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన రామ్ గోపాల్ వర్మ నా మొదటి ఆస్కార్ అని అన్నారు. తన తొలి ఆస్కార్ వర్మ అని.. ఆ తర్వాత నాటు నాటు పాటకు వచ్చిన ఆస్కార్ రెండోది అంటూ వ్యాఖ్యనించారు కీరవాణి. సంగీత దర్శకుడిగా అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలో దాదాపు 51మందిని కలిశాను. వాళ్లలో కొందరు నేను కట్టిన ట్యూన్స్ క్యాసెట్లను చెత్తబుట్టలో విసిరేశారు. అయినా వారు నన్ను పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది ? నా పాటలు వాళ్లెందుకు వినాలి ? అనుకున్నానని అన్నారు.

అలాంటి సమయంలో తాను రామ్ గోపాల్ వర్మను కలిశానని.. అప్పుడు ఆయన శివ ఆర్జీవీ అని.. ఆ తర్వాత క్షణక్షణంలో పనిచేసే అవకాశాన్ని ఇచ్చారని.. ఆయనే తన ఆస్కార్ అని.. ఎందుకంటే అప్పటివరకు కీరవాణి అంటే ఎవరికీ తెలియదు అని అన్నారు కీరవాణి. వర్మ అసోసియేషన్ తనకు ఎన్నో అవకాశాలు ఇచ్చిందని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఇది చూసిన ఆర్జీవి ఎమోషనల్ అయ్యారు. కీరవాణి మాటలను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. భావోద్వేగ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

కీరవాణి అలా మాట్లాడుతుంటే తనకు చనిపోయినా ఫీలింగ్ కలుగుతోందని.. ఎందుకంటే కేవలం చనిపోయినవారిని మాత్రమే అలా పొగుడుతారంటూ ట్వీట్ చేశారు ఆర్జీవి. ప్రస్తుతం వర్మ ట్వీట్ నెట్టింట వైరలవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.