Rangastalam: ‘రంగస్థలం’ మూవీలో ఆది ప్రేయసిగా నటించిన అమ్మాయి ఎవరో తెలుసా ?.. ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్ ఆమె..
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వై రవి శంకర్, సివి మోహన్ నిర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇందులో చరణ్ సరసన సమంత నటించగా.. ఆదిపినిశెట్టి, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, అనసూయ కీలకపాత్రలలో నటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 210 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరియర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ రంగస్థలం. 1980ల నేపథ్యంలో డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా 2018 మార్చి 30న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా.. భారీగా వసూళ్లు రాబట్టింది. ఇందులో చరణ్ నటనకు సినీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వై రవి శంకర్, సివి మోహన్ నిర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇందులో చరణ్ సరసన సమంత నటించగా.. ఆదిపినిశెట్టి, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, అనసూయ కీలకపాత్రలలో నటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 210 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఈ సినిమాలో ఆది పినిశెట్టికి ప్రేయసిగా నటించిన అమ్మాయి గుర్తుంది కదా. తను కనిపించింది తక్కువ సమయమే. కానీ తన ప్రేమకథ చుట్టూనే చిట్టిబాబు కథ మలుపుతిరుగుతుంది.
ఈ సినిమాలో ఆది పినిశెట్టి ప్రేయిసిగా కనిపించిన అమ్మాయి పూజిత పొన్నాడ. ఈ సినిమా హిట్ కావడంతో తెలుగులో ఆమెకు బాగానే ఆఫర్స్ వచ్చాయి. రంగస్థలం సినిమా అనంతరం.. పూజిత.. వేర్ ఈజ్ వెంకట లక్ష్మి, బ్రాండ్ బాబు, సెవెన్ చిత్రాల్లో నటించింది. పూజిత తెలుగమ్మాయే. ఏపీలోని విశాఖపట్నంకు చెందిన అమ్మాయి. ఇంజనీరింగ్ పూర్తిచేసిన పూజిత.. టాటా కన్సటెన్సీలో ఉద్యోగం చేసింది. ఆ తర్వాత నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2015లో ఉప్మా తినేసింది అనే షార్ట్ ఫిల్మ్ చేసింది. ఆ తర్వాత 2016లో తుంటరి సినిమాతో వెండితెరపై సందడి చేసింది.
తెలుగులో పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు అనుకున్నంత గుర్తింపు మాత్రం రాలేదు. ఇక ఇటీవల మాస్ మహారాజా రవితేజ నటించిన రావణాసుర చిత్రంలో కథానాయికగా నటించింది. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ఇక లేటేస్ట్ టాక్ ప్రకారం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తోన్న హరి హర వీరమల్లు సినిమాలో పూజిత స్పెషల్ సాంగ్ చేస్తుందని తెలుస్తోంది. అలాగే ఈ బ్యూటీ చేతిలో మరికొన్ని సినిమాలు ఉన్నాయని సమాచారం.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.