Mounamelanoyi Movie: సూపర్ హిట్ ‘మౌనమేలనోయి’ సినిమా హీరోయిన్ గుర్తుందా ?.. ఎంతగా మారిపోయిందో చూశారా ..
2002లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో సచిన్ జోషి, సంపద వజే హీరోహీరోయిన్లుగా నటించగా.. డైరెక్టర్ శ్యా్మ్ ప్రసాద్ తెరకెక్కించారు.

తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని ప్రేక్షకులకు దగ్గరయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందం, అభినయంతో తెలుగు తెరపై సందడి చేసి తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.. కానీ అతి కొద్ది సమయంలోనే ఇండస్ట్రీకి దూరమైపోతుంటారు. మొదటి సినిమాలోనే నటనపరంగా ప్రశంసలు అందుకున్నప్పటికీ ఆ తర్వాత అంతగా అవకాశాలు అందుకోలేక చిన్న చిన్న సినిమాలతో సర్దుకుపోతారు. మరికొందరు మాత్రం కేవలం ఒక్క సినిమాతోనే ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకుని… ఆ తర్వాత ఇతర రంగాలలో స్థిరపడిన హీరోయిన్స్ ఉన్నారు. అందులో మౌనమేలనోయి సినిమా హీరోయిన్ సంపద వజే ఒకరు. టాలెండ్ నటుడు సచిన్ జోషి నటించిన మౌనమేలనోయి చిత్రం అప్పట్లో డీసెంట్ సూపర్ హిట్.
2002లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో సచిన్ జోషి, సంపద వజే హీరోహీరోయిన్లుగా నటించగా.. డైరెక్టర్ శ్యా్మ్ ప్రసాద్ తెరకెక్కించారు. ఈ చిత్రానికి రమణ గోగుల సంగీతం అందించారు. ఈ సినిమాతోపాటు.. ఇందులోని సాంగ్స్ కూడా అప్పట్లో మంచి రెస్పాన్స్ వచ్చాయి. ముఖ్యంగా ఈ చిత్రంలోని ఓ ప్రియురాలా నా మధుబాలా నిజాల కలా.. నీ నయనాల ఆ గగనాల సితారకలా.. సాంగ్ ఇప్పటికే సంగీత ప్రియులకు ఫేవరేట్.




ఈ సినిమా తర్వాత సంపద మరో చిత్రంలో కనిపించలేదు. అమాయకత్వం.. చూడచక్కని రూపం.. అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులకు మెప్పించిన సంపదకు తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. మహారాష్ట్రలోని పూణె ప్రాంతానికి చెందిన సంపద.. గ్రాడ్యూయేషన్ అనంతరం నటనపై మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2002లో మౌనమేలనోయి సినిమాతో తెలుగు తెరకు పరిచమైన సంపద.. ఆ తర్వాత అంతగా అవకాశాలు రాలేదు. దీంతో ఆమె బీటౌన్ బుల్లితెరలో అడుగుపెట్టింది. 2004లో ప్యార్ కి కస్తి మేయిన్ సీరియల్లో నటించింది. ఆ తర్వాత రిస్తాన్ కి దూర్, సియా కే రామ్ ధారావాహికలలో నటించింది. 2016లో మంచి రెస్పాన్స్ వచ్చిన కర్మఫల్ దాత శని సీరియల్లో నటించింది సంపద. అయితే ఇంకా ఈ హీరోయిన్ పెళ్లి చేసుకుందా అనేది తెలియలేదు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




