Allu Arjun: న్యూలుక్లో అల్లు అర్జున్.. ఉంగరాల జుట్టుతో స్టైలీష్ స్టార్ కొత్త అవతారం..
ఇక ఇప్పుడు రాబోతున్న పుష్ప 2లో బన్నీ ఎలాంటి లుక్ లో కనిపించబోతున్నారు.. ఈ మూవీ ఎలా ఉండబోతుందని తెలుసుకోవడానికి తెగ ట్రై చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే తాజాగా ముంబై ఎయిర్ పోర్టులో అల్లు అర్జున్ న్యూలుక్ లో కనిపించి ఆశ్చర్యపరిచారు.
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పుష్ప సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడంతో ఈ మూవీపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా అప్డేట్స్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో బన్నీ ఊర మాస్ రగ్డ్ లుక్ లో కనిపించి అలరించారు. ఇక ఇప్పుడు రాబోతున్న పుష్ప 2లో బన్నీ ఎలాంటి లుక్ లో కనిపించబోతున్నారు.. ఈ మూవీ ఎలా ఉండబోతుందని తెలుసుకోవడానికి తెగ ట్రై చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే తాజాగా ముంబై ఎయిర్ పోర్టులో అల్లు అర్జున్ న్యూలుక్ లో కనిపించి ఆశ్చర్యపరిచారు.
ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న ఆయన స్టైలీష్ అండ్ కూల్ లుక్ లో కనిపించారు. ప్రింటెడ్ షర్ట్, వైట్ ప్యాంట్ లో చాలా సింపుల్ గా కనిపించారు. కానీ బన్నీ హెయిర్ స్టైల్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. బంగారు, నలుపు రంగులో ఉన్న జుట్టుకు వెనక కాస్త జడగా పెంచినట్లుగా కనిపిస్తోంది. దీంతో ఈసారి పుష్పరాజ్ రగ్డ్ లుక్ కాకుండా.. కాస్త్ స్టైలీష్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. దీంతో పుష్ప 2పై మరింత క్యూరియాసిటీ పెరిగింది.
డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఏప్రిల్ 8న బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా టాక్. దాదాపు 3 నిమిషాల యాక్షన్ టీజర్ బన్నీ బర్త్ డే గిఫ్ట్ గా విడుదల చేయబోతున్నారట. ఇందుకోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
.@alluarjun spotted at Mumbai Airport
Looking Stylish as always ?? pic.twitter.com/kWhHlTuEUy
— Allu Arjun FC (@AlluArjunHCF) March 24, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.