Don Seenu Movie: ‘డాన్ శీను’ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా..? ఆ బ్యూటీని ఇప్పుడు చూస్తే అస్సలు గుర్తుపట్టలేరు..

ఇందులో అందం, అభినయంతో మెప్పించిన అంజన నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినా.. అంజనకు మాత్రం తెలుగులో అవకాశాలు రాలేదు. ఈ మూవీ తర్వాత అంజనకు అంతగా ఆఫర్స్ రాకపోవడంతో ఆమె బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. హిందీలో అంజనాకు మంచి అవకాశాలు వచ్చాయి. దీంతో ఆమె అక్కడే సెటిల్ అయ్యింది.

Don Seenu Movie: 'డాన్ శీను' సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా..? ఆ బ్యూటీని ఇప్పుడు చూస్తే అస్సలు గుర్తుపట్టలేరు..
Anjana Sukhani
Follow us

|

Updated on: Aug 22, 2024 | 10:39 AM

మాస్ మాహారాజా ప్రధాన పాత్రలో డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కించిన చిత్రం డాన్ శీను. 2010లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అప్పట్లో థియేటర్లలో 100 రోజులకు పైగా ఆడిన సినిమా ఇది. ఇందులో రవితేజ సరసన శ్రియా కథానాయికగా నటించింది. మరోసారి వీరిద్దరి జోడిని బిగ్ స్క్రీన్ పై ఆదరించారు మూవీ లవర్స్. డాన్ శీను చిత్రాన్ని హిందీలో రెండుసార్లు డబ్ చేసారు. అలాగే బెంగాలీలోనూ రీమేక్ చేశారు. ఇదిలా ఉంటే ఈ మూవీ శ్రీహరి, షియాజీ షిండే, కస్తూరి శంకర్ కీలకపాత్రలు పోషించగా.. హీరోయిన్ శ్రియాకు స్నేహితురాలిగా నటించింది అంజనా సుఖానీ. ఇందులో అందం, అభినయంతో మెప్పించిన అంజన నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినా.. అంజనకు మాత్రం తెలుగులో అవకాశాలు రాలేదు. ఈ మూవీ తర్వాత అంజనకు అంతగా ఆఫర్స్ రాకపోవడంతో ఆమె బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. హిందీలో అంజనాకు మంచి అవకాశాలు వచ్చాయి. దీంతో ఆమె అక్కడే సెటిల్ అయ్యింది.

అంజన సుఖానా రాజస్థాన్ లోని జైపూర్ లో జన్మించింది. విదేశాల్లో ఎంఎస్ పూర్తి చేసిన అంజనా..ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. అదే సమయంలో అమితాబ్ బచ్చన్ తో కలిసి క్యాడ్బరీ డైరీ మిల్క్ యాడ్ చేసింది. ఆ తర్వాత పలు మ్యూజిక్ ఆల్బమ్స్ చేసింది. 2005లో హమ్ డమ్ అనే చిత్రంలో నటించింది. ఈ మూవీతోనే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత వడ్డే నవీన్ హీరోగా వచ్చిన నా ఊపిరి మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో మధు పాత్రలో నటించింది. ఈ మూవీ తర్వాత కూడా తెలుగులో అవకాశాలు రాలేదు. తెలుగు, హిందీతోపాటు కన్నడలోనూ పలు చిత్రాల్లో నటించింది. కథానాయికగా కాకుండా సపోర్టింగ్ రోల్స్ కూడా చేసింది.

ఇవి కూడా చదవండి

అయినప్పటికీ అంజనాకు ఆశించిన స్థాయిలో క్రేజ్ మాత్రం రాలేదు. ఆర్జీవీ తెరకెక్కించిన డిపార్ట్ మెంట్ చిత్రంలో రానా పాత్రలో కనిపించిన అంజనా..కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. పంజాబీ, మరాఠీ భాషలలోనూ సినిమాలు చేసిన అంజనా.. ఇప్పుడు పూర్తిగా సినీ పరిశ్రమకు దూరమైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తుంది. ఇప్పుడు అంజనా కాస్త బొద్దుగా మారడంతో గుర్తుపట్టడం కొంచెం కష్టమే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎట్టకేలకు OTTలోకి వచ్చిన సమంత, రానా సూపర్ హిట్ మూవీ.!
ఎట్టకేలకు OTTలోకి వచ్చిన సమంత, రానా సూపర్ హిట్ మూవీ.!
పైకి చూస్తే వట్టి పూతరేకుల పార్శిళ్లే.. తీరా తెరిచి చూడగా
పైకి చూస్తే వట్టి పూతరేకుల పార్శిళ్లే.. తీరా తెరిచి చూడగా
పెళ్లైన 2 నెలలకే.. బిగ్ ట్విస్ట్‌ ఇచ్చిన సోనాక్షి.! హాట్ టాపిక్..
పెళ్లైన 2 నెలలకే.. బిగ్ ట్విస్ట్‌ ఇచ్చిన సోనాక్షి.! హాట్ టాపిక్..
డైరెక్ట్‌ గా ఓటీటీలోకి కీర్తి సురేశ్ కాంట్రవర్సీ మూవీ. ఎందుకలా.?
డైరెక్ట్‌ గా ఓటీటీలోకి కీర్తి సురేశ్ కాంట్రవర్సీ మూవీ. ఎందుకలా.?
ఎలాంటి టెస్టులకైనా సిద్ధం అంటున్న హేమ. కానీ నెటిజన్స్ రిప్లై వేరే
ఎలాంటి టెస్టులకైనా సిద్ధం అంటున్న హేమ. కానీ నెటిజన్స్ రిప్లై వేరే
సుశీలమ్మ సేఫ్‌ క్షేమంగా ఇంటికి.! వాటిని నమ్మొద్దు అంటూ విజ్ఞప్తి.
సుశీలమ్మ సేఫ్‌ క్షేమంగా ఇంటికి.! వాటిని నమ్మొద్దు అంటూ విజ్ఞప్తి.
OG నుంచి దిమ్మతిరిగే అప్డేట్ | నాని సీరియస్.. టిల్లు గాడి మాస్..
OG నుంచి దిమ్మతిరిగే అప్డేట్ | నాని సీరియస్.. టిల్లు గాడి మాస్..
పుట్టిన రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెగాస్టార్ చిరంజీవి
పుట్టిన రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెగాస్టార్ చిరంజీవి
ఉత్తరాఖండ్‌లో షాకింగ్ ఘటన.. నదిలో కొట్టుకుపోయిన వ్యక్తి.. వీడియో
ఉత్తరాఖండ్‌లో షాకింగ్ ఘటన.. నదిలో కొట్టుకుపోయిన వ్యక్తి.. వీడియో
ఈ వారం చికెన్‌ ధరలు తెలిస్తే ఎగిరి గంతేస్తారు.! మరీ ఇంత తక్కువ.?
ఈ వారం చికెన్‌ ధరలు తెలిస్తే ఎగిరి గంతేస్తారు.! మరీ ఇంత తక్కువ.?