Panjaa Movie: ద్యావుడా.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ‘పంజా’ హీరోయిన్.. ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా.. ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ విష్ణువర్దన్ తెరకెక్కించిన సినిమా పంజా. ఇందులో సారా-జేన్ డయాస్ హీరోయిన్ గా నటించగా.. జాకీ ష్రాఫ్ , అడివి శేష్, అతుల్ కులకర్ణి కీలకపాత్రలు పోషించారు. ఇక ఇందులో సెకండ్ హీరోయిన్ గా నటించింది అంజలి లావానియా . ప్రస్తుతం ఈ బ్యూటీ ఏం చేస్తుందో తెలుసా..?

Panjaa Movie: ద్యావుడా.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 'పంజా' హీరోయిన్.. ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా.. ?
Anjali Lavania
Follow us

|

Updated on: Oct 18, 2024 | 12:17 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొందరు సినీతారలు ఒక్క సినిమాతోనే ఫేమస్ అయిపోతుంటారు. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ బిజీ అవుతారేమో అనుకుంటే.. అనుహ్యంగా సినిమాలకు దూరమైపోతుంటారు. అలాంటి వారిలో అంజలి లావానియా ఒకరు. ఏంటీ పేరు కొత్తగా విన్నట్లు అనిపిస్తుందా..? తనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పంజా మూవీలో సెకండ్ హీరోయిన్. సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకున్న సినిమా పంజా. డైరెక్టర్ విష్ణువర్దన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2011లో విడుదలై మిక్డ్స్ టాక్ అందుకుంది. ఇందులో పవన్ లుక్ అభిమానులకు తెగ నచ్చేసింది. ఇక ఇందులోని సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రం అప్పట్లో మ్యూజికల్ హిట్ అయ్యింది. ఇందులో సారా జేన్ డయాస్ కథానాయికగా నటించగా.. అంజలి లావానియా మరో హీరోయిన్ గా కనిపించింది. ఈ సినిమాతోనే ఈ బ్యూటీకి మంచి క్రేజ్ వచ్చేసింది.

పంజా సినిమాతో ఈ బ్యూటీ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి స్టార్ డమ్ సొంతం చేసుకుంటుందని అనుకున్నారంతా. కానీ అనుహ్యంగా సినిమాలకు దూరమైంది. తాజాగా ఈ బ్యూటీ గురించి నెట్టింట సెర్చింగ్ స్టార్ట్ చేశారు నెటిజన్స్. అంజలి లావానియా.. తెలుగులో చేసింది ఒకే ఒక్క సినిమా. ఈ బ్యూటీ 2012లో వోగ్ టాప్ 10 మోడల్స్ జాబితాలో చోటు సంపాదించుకుంది. అలాగే చాలా అందాల పోటీల్లో పాల్గొంది.

ఇది చదవండి : Bhadra Movie: వార్నీ.. ఏం ఛేంజ్ భయ్యా..’భద్ర’ మూవీలో రవితేజ మరదలు.. ఇప్పుడు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే..

ఈ బ్యూటీ చక్ర హీలింగ్, క్రియా యోగా వంటి వైద్యం చేసే కళలను నేర్చుకోవడానికి సినిమాలకు బ్రేక్ తీసుకుంది. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఈ అమ్మడు ఇప్పుడు డీజేగా మారింది. సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ తెగ వైరలవుతున్నాయి.

ఇది చదవండి :

Bhadra Movie: వార్నీ.. ఏం ఛేంజ్ భయ్యా..’భద్ర’ మూవీలో రవితేజ మరదలు.. ఇప్పుడు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే..

Actress Laya: అందంలో అమ్మను మించిపోయిన డాటర్.. హీరోయిన్ లయ కూతురిని చూశారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.