AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vikramarkudu: విక్రమార్కుడులో స్పెషల్ సాంగ్ చేసిన ఈ చిన్నది గుర్తుందా..? అందాలతో మెంటలెక్కిస్తోందిగా..

మాస్ మాహారాజా రవితేజ, డైరెక్టర్ రాజమౌళి కాంబోలో వచ్చిన చిత్రం విక్రమార్కుడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో అనుష్క కథానాయికగా నటించగా.. ఓ అమ్మడు స్పెషల్ సాంగ్ చేసింది ఓ అమ్మడు.

Vikramarkudu: విక్రమార్కుడులో స్పెషల్ సాంగ్ చేసిన ఈ చిన్నది గుర్తుందా..? అందాలతో మెంటలెక్కిస్తోందిగా..
Actress
Rajitha Chanti
|

Updated on: Nov 16, 2024 | 10:49 AM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ మహరాజా రవితేజ ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. హిట్టు, ప్లాపులతో సంబంధమే లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించాడు. రవితేజ నటించిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో విక్ర మార్కుడు ఒకటి. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్‏లో అనుష్కా శెట్టి హీరోయిన్ గా నటించగా.. ఇందులో బ్రహ్మానందం, రాజీవ్ కనకాల, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీలో రవితేజ ద్విపాత్రాభినయంతో అదరగొట్టాడు. అటు చిల్లర దొంగ అత్తిలి సత్తిబాబుగా కడుపుబ్బా నవ్విస్తూనే, ఇటు పవర్ ఫుల్ పోలీసాఫీసర్ విక్రమ్ రాథోడ్ పాత్రలో మెప్పించాడు. ఇక ఈ సినిమాలోని సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా ‘ వస్తావా వస్తావా.. ఒక్కసారి వస్తావా’ అంటూ సాగిపోయే స్పెషల్ సాంగ్ అప్పట్లో ఓ ఊపు ఊపేసింది. ఇందులో తన అందచందాలతో మైమరిపించి హుషారైన స్టెప్పులేసింది ఓ అందాల ముద్దుగుమ్మ. ఈ పాటతో ఇండస్ట్రీలో చాలా ఫేమస్ అయిన ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.. ?ఆమె అచ్చ తెలుగమ్మాయి. ఆమె మరెవరో కాదు మేఘనా నాయుడు.

విజయవాడకు చెందిన మేఘన ముంబైలో చదువుల కోసం ముంబై వెళ్లింది. ఆ తర్వాత నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది. 18 ఏళ్ల వయసులోనే ప్రేమ సాక్షి అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత పృధ్వీ నారాయణ, వెండి మబ్బులు తదితర సినిమాల్లో నటించి అలరించింది. తెలుగుతోపాటు కన్నడ, హిందీ, బెంగాలీ, తమిళ, మలయాళ చిత్రాల్లోనూ కీలకపాత్రలు పోషించి ఓ గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఈ బ్యూటీకి తెలుగులో సరైన బ్రేక్ మాత్రం రాలేదు.

ఇవి కూడా చదవండి

దీంతో పలు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. బాలకృష్ణ పాండు రంగడు, నాగ చైతన్య 100% లవ్, నాని పిల్ల జమీందార్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో మెరిసింది. ఆ తర్వాత కొన్నాళ్లకే సినిమాలకు దూరంగా ఉండిపోయింది. 2016 లో టెన్నిస్ ఆటగాడు లూయిస్ మిగ్యుల్ రీస్‌ ను ప్రేమ వివాహం చేసుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఆమె తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ లోనే ఉంటుంది. ఇటు సోషల్ మీడియాలో యాక్టివ్గ ఉంటూ క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తుండగా.. మేఘనను చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us